జపాన్ దేశంలో కూడా దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందా.. అసలేమైందంటే?

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ (NTR, Koratala Siva)కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (devara)సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.

ఈ సినిమాతో రాజమౌళి (Rajamouli)సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు తారక్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సక్సెస్ గా నిలిచింది.

ఇకపోతే ఇటీవలే ఈ సినిమాను జపాన్ (Japan)లో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇందుకోసం తారక్ వారం రోజుల ముందే అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలని కూడా చేపట్టారు.

అయితే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా అనిపించింది.జపాన్ దేశంలో కూడా ఈ సినిమా బాగా కలెక్షన్లను సాధించింది.

Advertisement
Jr Ntr Devara Successful Run In Japan Box Office Also, Jr Ntr, Devara,japan, Tol

ఈ సినిమా మంచి హిట్ అవడంతో రెండు రోజులు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.యూఎస్ మార్కెట్ లో రికార్డు వసూళ్లు ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది.

ఇక ఈ సెన్సేషనల్ రన్ తర్వాత ఇటీవల జపాన్ దేశంలో కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకెళ్లారు.అయితే జపాన్ లో కూడా దేవర మన దగ్గర నడిచినట్టే సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

Jr Ntr Devara Successful Run In Japan Box Office Also, Jr Ntr, Devara,japan, Tol

అక్కడ విజయవంతంగా 3 వారాల రన్ ని కంప్లీట్ చేసుకొని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యింది.దీనితో అక్కడ కూడా దేవర మంచు సక్సెస్ సాధించింది అని చెప్పవచ్చు.ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్(NTR Arts, Yuvasudha Arts) వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా జపాన్లో కూడా మంచి విజయం సాధించడంతో మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు