వావ్, తారక్‌కి పునర్జన్మ కలిగిన రోజే లక్ష్మీ ప్రణతి పుట్టిందట..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్యూటిఫుల్ జంటలు ఉన్నాయి.

అలాంటి జంటల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి (Young Tiger NTR - Lakshmi Pranathi )దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు.తారక్ కు ప్రణతి అంటే మహా ఇష్టం.

ఆమెను ఎంతో గౌరవంగా చూసుకుంటాడు.తారక్‌ తన సతీమణికి ఇస్తున్న రెస్పెక్ట్ చూస్తుంటే ఎవరికైనా సరే ముచ్చట వేస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ ఆమెపై ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటాడు.ఇక ప్రణతి కూడా జూనియర్ ఎన్టీఆర్ పై ఎంతో ప్రేమ చూపిస్తుంది.

Advertisement

వీరిద్దరి అన్యోన్యమైన అనుబంధాన్ని చూసి తారక్ ఫ్యాన్స్, నెటిజన్లు చాలా సంతోషిస్తుంటారు."భార్యాభర్తలు అంటే అలా ఉండాలి రా" అంటూ కామెంట్ కూడా చేస్తుంటారు.

ఒక గొప్ప భార్య దొరికిందంటూ తారక్ కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు.ప్రణతి నిజంగా ఒక ఎన్టీఆర్ కు మంచి వైఫ్, పిల్లలకు మంచి మదర్ అని చెప్పుకోవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కంటిన్యూగా నటిస్తున్నాడంటే అందుకు ప్రణతి స్ట్రాంగ్ సపోర్టే కారణమని చెప్పుకోవచ్చు.పిల్లలను చాలా గొప్పగా పెంచుతోంది ప్రణతి.

అయితే ప్రణతి తన భార్య అవ్వాలని డెస్టినీ నిర్ణయించిందని తారక్ ఎప్పుడూ చెబుతుంటాడు.తనకు ఆమే భార్యగా రాసిపెట్టి ఉందని అంటుంటాడు.అయితే ఈ మాటల వెనుక ఉన్న గల కారణం ఏంటో ఆయన ఒకసారి వివరించాడు.

ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?

ఈ హీరో మాట్లాడుతూ తనకు 2009లో మార్చి 26వ తేదీన రాత్రి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడు.టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా జూ.ఎన్టీఆర్ పనిచేస్తున్నాడు.ఆ సమయంలో ప్రచారం ముగించుకుని ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం చెట్టును ఢీ కొట్టింది.

Advertisement

ఈ ప్రమాదంలో తారక్ తల, గుడి, భుజం, మోచేతిపై గాయాలు అయ్యాయి.అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని, నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.ఈ సంఘటనను ఎన్టీఆర్ ఎప్పటికీ మర్చిపోలేడు.

ఇది మార్చి 26వ తేదీన జరిగిందని కూడా గుర్తుంచుకున్నాడు.అది తనకు ఒక పునర్జన్మ లాంటిది అని అంటుంటాడు.

ఆ తేదీని తన సెకండ్ బర్త్‌ డే లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాడు.

అయితే రెండేళ్ల తర్వాత ఆయనకు పెళ్లి కుదిరింది.ఆ పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో తారక్ ప్రణతిని నీ పుట్టిన రోజు ఎప్పుడు?" అని అడిగాడు ఆమె మార్చి 26 అని చెప్పింది.దాంతో "ఏంటీ, మార్చి 26 హా?" అని తారక్ ఆశ్చర్యపోయాడట.తనకి సెకండ్ బర్త్‌ డే అయిన రోజే తన కాబోయే భార్య ఫస్ట్ బర్త్‌ డే అయిందని తెలుసుకుని చాలా ఆశ్చర్యానికి గురయ్యాడట.

బహుశా ఆ దేవుడు తనకోసమే ప్రణతిని పుట్టించాడేమో అని అప్పుడే తారక్ నిర్ణయించుకున్నాడు.ఈ విషయాన్ని అతనే తెలియజేశాడు.ఇకపోతే లక్ష్మీ ప్రణతి రియల్టర్, వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు ( Businessman Narne Srinivasa Rao )కుమార్తె.

ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఈ పెళ్లి కుదిరిచ్చారు.శ్రీనివాసరావు భార్య బాబుకు మేనకోడలు అవుతారు.

ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతిల వివాహం 2011లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.వీరికి కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు.

ప్రణతిని ఎన్టీఆర్ క్యూట్ గా ‘అమ్ములు’ అని పిలుస్తాడు.

తాజా వార్తలు