అమెరికా - మెక్సికో సరిహద్దు వివాదం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.
యూఎస్‌లోకి( USA ) చట్టవిరుద్ధంగా ప్రవేశించాలనుకునే అక్రమ వలసదారులకు మెక్సికో సరిహద్దును( Mexico Border ) గేట్ వేగా చెప్పుకుంటారు.
ఈ మార్గం గుండానే ఎంతోమంది నేరగాళ్లు అమెరికాలోకి ప్రవేశిస్తూ వుంటారు.ఇక సంఘ విద్రోహ శక్తులకు ఇది రాచమార్గం.
దేశ భద్రతకు పెను ప్రమాదం పొంచి వుండటంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) మెక్సికో గోడను నిర్మించడంతో పాటు సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు.
ఇప్పుడు ట్రంప్ అధికారంలో లేరు.దేశ సరిహద్దుల విషయంలో ఆయన వున్నంత దూకుడుగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్( President Joe Biden ) లేరంటూ రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మెక్సికో సరిహద్దు గోడను విస్తరించే ప్రణాళికలను సమర్ధించిన ఆయన.ట్రంప్ హయాంలో ప్రవేశపెట్టిన చట్టాలకు కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మెక్సికో గోడను( Mexico Wall ) విస్తరించే ప్రణాళికలను నిలిపివేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు.అప్పట్లో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కానీ ఇప్పుడు అధ్యక్షుడయ్యాక బైడెన్ స్వరంలో మార్పు వచ్చింది.దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో వలసలు, సరిహద్దు దాటుతున్న ఘటనలను తీవ్రంగా పరిగణించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే తక్షణ అవసరాన్ని దృష్టిలో వుంచుకుని మెక్సికో గోడను విస్తరించేందుకు సానుకూలంగా స్పందించారు బైడెన్.
అలాగే వలసదారులకు కేంద్రాలుగా వున్న దేశాల్లో ఒకటైన వెనిజులాకు ‘‘deportation flights’’ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.మెక్సికన్ గోడ విషయంలో ట్రంప్ తన చేతుల్ని కట్టేసినట్లుగా బైడెన్ వ్యాఖ్యానించారు.వారు డబ్బును దేనికి కేటాయించారో దానికే ఉపయోగించాలి.తాను దానిని ఆపలేనని అధ్యక్షుడు అన్నారు.2019లో ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ కాంగ్రెస్.( US Congress ) మెక్సికో సరిహద్దు గోడ కోసం నిధుల్ని కేటాయించిందని బైడెన్ తెలిపారు.
ఆ నిధులను తిరిగి కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని చట్టసభ సభ్యులు తిరస్కరించారని అధ్యక్షుడు వెల్లడించారు.
ఇదే సమయంలో అక్రమ వలసలు( Illegal Migrations ) బైడెన్‌కు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారాయి.ప్రభుత్వం సరిహద్దు విధానాలను సడలించిందని ప్రతిపక్ష రిపబ్లికన్‌లు ఆరోపించారు.సరిహద్దు సమస్య ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సహాయంపై అనిశ్చితిని కూడా పెంచింది.
దీంతో కొంతమంది రిపబ్లికన్లు.బైడెన్ వలసదారులపై చర్యలు తీసుకునే వరకు నిధులను ఆమోదించడానికి నిరాకరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy