మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన జో బైడెన్..!!

2024లో జరగబోయే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డెమోక్రటిక్ ( Democratic )పార్టీ తరఫున మళ్లీ పోటీ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా జో బైడెన్ (Joe Biden)ప్రకటించారు.ఈ క్రమంలో ఆయన డెమొక్రటిక్ పార్టీ తరపున రీ ఎలక్షన్ బిడ్ ను ప్రారంభించారు.

2024 నవంబర్ లో అమెరికా అధ్యక్ష( US President) ఎన్నికలు జరగనున్నాయి.ఈ ప్రక్రియకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ నెల నుండే ప్రక్రియ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాదు డెమోక్రటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ గా మరోసారి కమలా హారిస్(Kamala Harris) పోటీ చేయబోతున్నట్లు జో బైడెన్ ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో అధ్యక్ష బరిలో నిలిచే వారి కోసం ఆయా పార్టీల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతుంటాయి.

Joe Biden Has Announced That He Is Going To Run For The Presidency Of The United

అయితే అధ్యక్షుడు రెండోసారి బరిలోకి దిగుతుండడంతో అధికార పార్టీలో ప్రైమరీ ఎన్నికలు(Primary elections) నిర్వహించే అవకాశం లేదు.ఇక రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక అదే పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్ రన్ డీశాంటిస్ పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Joe Biden Has Announced That He Is Going To Run For The Presidency Of The United

మరి ఈసారి అమెరికన్ లు జో బైడెన్ కి అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి.ఎందుకంటే ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు.వయసు పైబడుతూ ఉండటంతో అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా లేదా అన్నది సందిగ్ధంగా నెలకొన్నది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు