తెలంగాణలో కొనసాగుతోన్న కొలువుల జాతర

తెలంగాణలో సర్కార్ కొలువుల జాతర కొనసాగుతోంది.తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు టీఎస్పీఎస్సీ, గురుకుల విద్యాలయాల నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది.ఈ క్రమంలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Job Notifications In Telangana State-తెలంగాణలో కొనసా

గురుకులాల్లో 87 టీజీటీ పోస్టులు, బీసీ గురుకులాల్లో 1,499 పోస్టులతో పాటు 480 డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది.అదేవిధంగా బీసీ గురుకులాల్లో 153 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు