జియో కంపెనీకి లాభమా? నష్టమా?

జీయో సిమ్ .ఇప్పుడు అంతటా ఇదే చర్చ.

ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారు .

రిలియన్స్ డిజిటల్ స్టోర్లు స్టార్ హీరోల సినిమా ఆడుతున్న థియేటర్లను తలపిస్తున్నాయి.ఇంత హంగామా ఎందుకో మనందరికి తెలిసిందే.

మూడు నెలలపాటు 4G ఇంటర్నెట్ ఫ్రీ .అది కూడా అన్ లిమిటెడ్, అన్ లిమిటెడ్ కాల్స్ ఫ్రీ, అన్ లిమిటెడ్ ఎస్సెమ్మెస్ ఫ్రీ.ఇంకా జియో ఆప్స్ అన్నిటకి ఫ్రీ ఆక్సెస్.

పోని .ఆ సిమ్ తీసుకోవడానికైనా ఏమైనా ఖర్చుపెట్టాలా అంటే, అదీ లేదు.సిమ్ కూడా ఫ్రీ.

Advertisement

ఇలా రిలయన్స్ సంస్థ అందరికి దానధర్మాలు ఎందుకు చేస్తోంది? అందరికి ఉచిత కాల్స్, ఉచిత 4G నెట్, ఉచిత యాప్ ఆక్సెస్ ఎందుకు ఇస్తోంది? ఇలా చేస్తే వారికి లాభమా, నష్టమా ? ఈ జియో సిమ్ వలన రిలయన్స్ కి లాభామే ఉంది అని మోర్గాన్ స్టాన్లీ రిపోర్టు చెబుతోంది.వచ్చే ఏడాదికల్లా జియో కష్టమర్లు 4 కోట్లు దాటుతారంట.

కేవలం 4G స్మార్ట్ ఫోన్లకే తన సర్వీసులు అందిస్తూ ఇలాంటి స్పందన పొందడం నిజంగా చారిత్రాత్మకం.వచ్చే రెండేళ్ళలో జియోకి 2 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందట.

ఒక్కో వినియోగదారుడి నుంచి కనీసం 300 రూపాయల ఆదాయం జియో జేబులో పడుతుందని ఆ రిపోర్టు చెప్పుకొచ్చింది.డేటా రంగంలో 19% వాటా, వాయిస్ కాల్స్ లో 2% శాతం జియో సిమ్స్ ఆక్రమించనున్నాయని ఈ రిపోర్టు తెలిపింది.

వామ్మో .అని అప్పుడే ఆశ్చర్యపోకండి.రాబొయే రోజుల్లో జియో మొబైల్ నెట్వర్క్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

చూడాల్సిన వింతలన్ని ఇంకా ముందే ఉన్నాయి.

Advertisement