ఫ్లయింగ్ కార్ మార్కెట్లోకి వచ్చేస్తుంది.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?

ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ( Technology ) అనేది అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.ఈ క్రమంలోనే గాలిలో ఎగిరే కారు అందుబాటులోకి రానుంది.

పైగా పైలట్ లైసెన్స్ కూడా అవసరం లేదు.పలు కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా గాలిలో ఎగిరే కార్లను ఉత్పత్తి చేయాలని సరికొత్త పరిశోధనలు మొదలుపెట్టాయి.

ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఓ సంస్థ ఎగిరే కారు( Flying Car )ను రూపొందించి ప్రయాణికులకు సరికొత్త అనుభూతి ఇవ్వనుంది.

అమెరికాకు చెందిన జెట్సన్ అనే కంపెనీ.జెట్సన్ వన్( Jetson One ) పేరుతో ఫ్లయింగ్ కార్లు రూపొందించింది.ఈ కారు ధర USD 80,000 వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది.భారత కరెన్సీ ప్రకారం రూ.80.19 లక్షలు.అయితే మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది.

Advertisement

ముందుగా ఎనిమిది వేల అమెరికన్ డాలర్లను అడ్వాన్స్ గా చెల్లించాలి.మన భారత కరెన్సీ ప్రకారం రూ.6.5 లక్షలు.ఈ ఫ్లయింగ్ కార్ ప్రత్యేకతలు ఏమిటంటే.

ఇది మొత్తం విద్యుత్ తో నడుస్తుంది.దీనిని డ్రోన్ మోడల్( Dreone Model ) ఆధారంగా రూపొందించారు.

ఈ కారు నిలువుగా టేక్ ఆఫ్, ల్యాండింగ్ లక్షణాలతో తయారు చేయబడింది.ఇక ఈ కారు 2480mm, వెడల్పు 1500mm, ఎత్తు 1030mm ఉంది.

ఈ కారు బరువు దాదాపుగా 86 కిలోలు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఈ కారు నడపడం ఎంతో సులభం.ఇందులో రెండు జాయ్ స్టిక్లు( Joy Sticks ) ఉంటాయి.ఒకటి దిశను మార్చడం కోసం, మరొకటి ఎగిరే కారు ఎత్తును నియంత్రించడం కోసం ఉపయోగించాలి.

Advertisement

సింపుల్ గా చెప్పాలంటే వీడియో గేమ్ ఆపరేట్ చేసే విధానాన్ని పోలి ఉంటుంది.ఈ కారులో 88kWh బ్యాటరీ ఉంటుంది.ఈ కారు భూమి నుంచి దాదాపుగా 15 అడుగుల దూరం వరకు ఎగురుతుంది.

ఇక గంటకు 101 కిలోమీటర్ వేగంతో ప్రయాణించవచ్చు.దీని ల్యాండింగ్ మెకానిజం ఆటోమేటెడ్ LiDAR సెన్సార్ తో భూమిపై కూడా నడవగలదు.

ఈ ఎగిరే కారుతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.ఇక ఈ కారు నడపడం కోసం ప్రత్యేకంగా లైసెన్స్ అవసరం లేదు కానీ ఆయా దేశాల రూల్స్ పై ఆధారపడి ఉంటుంది.

అయితే ఒకసారి బ్యాటరీ చార్జింగ్ చేసే ఎంత దూరం ప్రయాణిస్తుంది.ఎంత రేంజ్ ఇస్తుంది అనే విషయాలు సంస్థ వెల్లడించలేదు కానీ ఈ సంవత్సరం ఆఖరిలో మాత్రం కచ్చితంగా ఈ కారు ఆకాశంలో ఎగరనుంది అని సంస్థ వెల్లడించింది.