భాజాపాచూపు - మిత్రుల వైపు??

2019 సార్వత్రిక ఎన్నికలలో సింగిల్గా అధికారం వచ్చిన తర్వాత భాజపానేతల దొరణి చాలా మారింది.ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం.

మిత్రపక్షాల మాటకు విలువ ఇవ్వకపోవడం ప్రతి విషయంలోనూ తమ మాటనే నెగ్గించుకునే ధోరణితో ముందుకు వెళ్ళటం పట్ల మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది అనేక నిర్ణయాలు పట్ల ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా తమకున్న సంఖ్యాబలంతో బిల్లులు నెగ్గించుకుంటూ ముందుకే వెళ్ళింది.ముఖ్యంగా రైతు చట్టాల విషయంలోనూ పౌరసత్వ చట్టం సవరణ విషయంలోనూ, కాశ్మీర్( Kashmir ) స్వయం ప్రతిపత్తి విషయాలలోనూ ఇంటా బయట అనేక వ్యతిరేకతల వచ్చినా కూడా పెద్దగా లెక్క చేయలేదు .అయితే క్రమంగా పరిస్థితిలో మారుతూ రావడానికి గమనిస్తున్న బాజాపా వచ్చే సార్వత్రిక ఎన్నికల లో ఒంటరిగా మేజారిటీ వచ్చే పరిస్థితి లేదన్న విషయాన్ని గ్రహించి నట్టుగా ఉంది .ఇప్పుడు మిత్రపక్షల అవసరాన్ని గుర్తించినట్లుగా ఆ పార్టీ నేతలు తీసుకుంటున్న చర్యలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి .

Jds Eye On Old Friend , Jds, Kashmir, Andhra Pradesh, Karnataka, Bjp, Narendra M

తమ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరిగిందని గ్రహిస్తున్న భాజాపా నేతలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలో దోస్తీ కోసం వేగంగా పావులు కదుపుతున్నారు.ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh ) తెలుగుదేశంమరియు అదికార వైసీపీతో ఏక కాలం లో చెలిమి చేస్తున్న కమలనాధులు కర్ణాటకలో కూడా ఇప్పుడు జేడీఎస్( JDS ) పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Jds Eye On Old Friend , Jds, Kashmir, Andhra Pradesh, Karnataka, Bjp, Narendra M

కర్ణాటక ఎన్నికలలో కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకున్న జెడిఎస్ పార్టీ ఇప్పుడు పొలిటికల్ గా సంధి వ్యవస్థలో ఉంది .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుడైన బిజెపితో పొత్తు పెట్టుకుంటే క్యాడర్ను కాపాడుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్న జెడిఎస్ బిజెపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.జెడిఎస్ కున్న ఓటు బ్యాంకు తమకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగపడుతుందనే అంచనా తో భాజపా కూడా జెడిఎస్ కు దగ్గర అవుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement
JDS Eye On Old Friend , JDS, Kashmir, Andhra Pradesh, Karnataka, Bjp, Narendra M

ఏకపక్షంగా కాకపోయినా మిత్రుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయాలని పట్టుదలతో కమలనాధులు ఉన్నట్లుగా తెలుస్తుంది .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు