విశాఖ ఎంపీ గా జేడీ పోటీ ! ఆ పార్టీలో చేరాలని ఉన్నా... ?

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని సిబిఐ మాజీ జేడీ వీవి లక్ష్మీనారాయణ( V.V.

Lakshminarayana ) డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ నుంచి జేడీ పోటీ చేసి ఓటమి చెందారు.ఓడిన తరువాత కూడా పూర్తిగా విశాఖ కేంద్రంగానే జేడీ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ విశాఖ నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు.ఇక జనసేన పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు తో ఆయన ఆందోళన చెందారు.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడంతో మనస్థాపానికి గురైన జెడి జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చారు.అప్పటి నుంచి విశాఖలోనే మకాం వేసి తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అనేక సామాజిక చైతన్య సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తాను అందరివాడిని అనే గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.జేడీ ని చేర్చుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నాలు చేసినా,  ఆయన మాత్రం ఏ పార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.వైసిపి లో ఎలాగూ చేరే అవకాశం లేదు.

Advertisement

గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జేడీ ఆధ్వర్యంలోనే జరగడంతో ఆ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరరు.ఇక టిడిపిలో చేరుదామన్నా, ఇప్పటికే అక్కడ విశాఖ టిడిపి అభ్యర్థిగా భరత్ ను ప్రకటించారు.

ఇక బిజెపి జెడి కోసం ప్రయత్నాలు చేసినా,  తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపినా,  మొదటి నుంచి ఆయన బిజెపికి దూరంగానే ఉంటున్నారు.ఇక మిగిలింది జనసేన పార్టీనే.

ఇటీవల కాలంలో జనసేన పైన , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పైన జెడి ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే గతంలో ఆ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్లీ తనకు తానుగా వెళ్లి జనసేన( Jana Sena )లో చేరేందుకు జెడి మొహమాటపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.జనసేన కూడా పెద్దగా ఆయనను చేర్చుకునే ప్రయత్నాలు చేయడం లేదు.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగానే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని జేడీ డిసైడ్ అయిపోయారట.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు