ప్రముఖ సినీ నటి , మాజీ ఎంపీ జయప్రద( Former MP Jayaprada ) తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కొంతకాలం క్రితమే ఆమె బీజేపీ లో చేరారు.
అయితే ఆ పార్టీలో ఇమడ లేకపోతున్నారో ఏమిటో తెలియదు కానీ, బిఆర్ఎస్( Brs ) లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.చాలాకాలంగా ఆమె రాజకీయ అడుగులపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
ఆమె ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు అని అంతా భావిస్తుండగా.జయప్రద మాత్రం బీఆర్ఎస్ లో చేరి ఎంపీ అవ్వాలనే ఆశతో ఉన్నారు.
ఇక బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( Telangana CM KCR ) జయప్రదను తమ పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగానే ఉన్నారు.
అయితే ఆమెను ఏపీ తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర ( Maharashtra )ఎన్నికల్లో పోటీకి దించాలనే ప్లాన్ తో కేసీఆర్ ఉన్నారట.చాలాకాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.అక్కడే పార్టీకి సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తరచుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ, పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న జయప్రదను తమ పార్టీలో చేర్చుకుని మహారాష్ట్ర ఎన్నికల బరిలో దింపాలనే ఆలోచనతో ఆయన ఉన్నారట.
తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా, ఆ తరువాత టిడిపికి దూరమై సమాజ్వాది పార్టీలో చేరారు.
రెండుసార్లు ఎంపీగాను జయప్రద గెలిచారు .రాజకీయంగా అమర్ సింగ్( Amar Singh ) ఆమెకు గురువు.అయితే ఆయన చనిపోయిన తర్వాత జయప్రద రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది.
దీంతో చాలాకాలంగా ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు.అయితే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ లో చేరి ఎంపీ అవ్వాలని చూస్తుండగా కేసీఆర్ సైతం ఆమెను మహారాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ చేసినందుకు సిద్ధమవుతున్నారట.
త్వరలోనే ఆమె బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy