సొంత అక్కకే పోటీగా నిలిచిన జయమాలిని.. జ్యోతిలక్ష్మి లాస్ట్ డేస్ ఎలా గడిచాయంటే..??

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్సర్లకు మస్తు క్రేజ్ ఉండేది.జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత హాట్‌హాట్‌గా డ్యాన్సులు చేస్తూ వెండితెరపై మంటలు పుట్టించేవారు.

జ్యోతిలక్ష్మీ( Jyothilaxmi ) అందరికంటే ముందు ఇండస్ట్రీలో అడుగుపెట్టి వెయ్యి కంటే ఎక్కువ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.300 సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ కూడా పోషించింది.అయితే ఈమెకు పోటీగా జయమాలిని( Jayamalini ) సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

జ్యోతిలక్ష్మికి ఈమె స్వయానా చెల్లెలు అవుతుంది కానీ వీరి మధ్య అక్కాచెల్లెళ్ల వలె అనుబంధం ఏమీ లేదు.చిన్నప్పటి నుంచి ఒకరికొకరు మాట్లాడుకునే వారు కాదు.ఈ సిస్టర్స్ తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టారు.

వీళ్లు మొత్తం ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు.వారిలో జ్యోతిలక్ష్మి అందరిలోకెల్లా పెద్దది.

జయమాలిని చివరి సంతానం.ప్రముఖ తమిళ నటి ఎస్‌.

Advertisement

పి.ఎల్‌.ధనలక్ష్మి జ్యోతిలక్ష్మీని చిన్నతనంలోనే అడాప్ట్ చేసుకున్నది కాబట్టి ఈ సిస్టర్స్ కలిసి జీవించడం కుదరలేదు.

జ్యోతిలక్ష్మి, జయమాలిని అనేక సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.అయితే అప్పుడు కూడా మాట్లాడుకునేవారు కాదు.

షూటింగ్ అయిపోయిన వెంటనే ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు.

ఇద్దరి మధ్య పేగు బంధం ఉన్నా ఎందుకు మాట్లాడుకునేవారు కాదు అని అడిగినప్పుడు జయమాలిని కారణం చెప్పింది.జ్యోతిలక్ష్మి సినిమాల్లోకి వచ్చాక బాగా డబ్బు సంపాదించిందని, ఆ సమయంలో తమ కుటుంబం ఆర్థికంగా పేద స్థితిలో ఉందని, అందువల్ల జ్యోతిలక్ష్మి చులకనగా చూసేదని జయమాలిని తెలిపింది.జయమాలిని తన అక్క జ్యోతిలక్ష్మి ఇంటికి పోయినా రానిచ్చేవారు కాదు.

వైరల్ వీడియో : దేవుడా.. గేదె మేడలో 10 కేజీల గోల్డ్ చైన్..
ప్రేక్షకులకు నచ్చకపోవడంతో లెన్త్ తగ్గించుకున్న సినిమాలు ఇవే !

బయటికి వెళ్లిపోతున్నాం అని చెప్పి ఈమెను బయట నుంచి బయటికే పంపించేవారు.ఇలాంటి అవమానాలను ఆమె చాలానే ఫేస్ చేసింది.

Advertisement

మరోవైపు పెంపుడు తల్లి కోరిక మేరకు వాసుదేవన్( Vasudevan ) అనే ఒక వ్యక్తిని జ్యోతిలక్ష్మి పెళ్లాడింది.అతడికి అప్పటికే వేరే మహిళతో పెళ్లి అయింది.అందుకే వీరిద్దరూ సీక్రెట్‌గా ఎనిమిదేళ్లపాటు సహజీవనం కొనసాగించారు.

వాసుదేవన్ మొదట్లో మంచిగా ఉన్నా తర్వాత ఆమెను టార్చర్ చేసేవాడు.సినీ నిర్మాతలతో గొడవలు పెట్టుకునేవాడు.

దీని ఫలితంగా జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గిపోయాయి.చివరికి వాసుదేవన్‌తో తనకు ఎలాంటి అఫైర్ లేదని చెబుతూ సినిమాటోగ్రాఫర్‌ సాయిప్రసాద్‌ను( Cinematographer Saiprasad ) పెళ్లి చేసుకుంది.

వాసుదేవన్‌తో ఆమె మీనాక్షి అనే బిడ్డకు జన్మనిచ్చింది.సాయిప్రసాద్ ని పెళ్లి చేసుకున్నాక జ్యోతిమీనా అని పేరు చేంజ్ చేశారు.

జ్యోతిలక్ష్మీ డబ్బు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చాలా నష్టపోయింది.మరోవైపు ఆమె చెల్లి జయమాలిని స్టార్ డ్యాన్సర్‌గా ఎదిగింది.పర్సనల్ లైఫ్ వల్ల జ్యోతిలక్ష్మి అవకాశాలు కోల్పోతుంటే అవన్నీ జయమాలినికే వచ్చేవి.

ఒకప్పుడు జ్యోతిలక్ష్మికి వచ్చిన క్రేజ్, రెమ్యునరేషన్ జయమాలినికి దక్కింది.ఆ డబ్బుతో అక్కలకు, అన్నయ్యలకు తన డబ్బుతోనే పెళ్లిళ్లు కూడా చేసింది.

జ్యోతిలక్ష్మీ చివరి దశలో అనారోగ్యం బారినపడి తమ కుటుంబం గురించి తలుచుకొని ఎంతో బాధపడేది.అప్పుడప్పుడు చెల్లెలు దగ్గరికి వెళ్తూ ఉండేది.

జయమాలిని కూడా జరిగినవన్నీ మర్చిపోయి అక్కను చేరదీసేది.అయితే జ్యోతిలక్ష్మి 2016, ఆగస్టు 9న బ్లడ్‌ క్యాన్సర్‌తో మరణించి సినీ లోకాన్ని విషాదంలో ముంచింది.

తాజా వార్తలు