మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవికి( Jayam Ravi ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

విభిన్నమైన కథలను ఎంచుకుని ఎన్నో విజయాలను ఆయన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ నటుడి విడాకుల వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.జయం రవి సోషల్ మీడియా పోస్ట్ తాను తన భార్యతో పరస్పర అంగీకారంతో విడిపోతున్నానని వెల్లడించడం జరిగింది.

అయితే జయం రవి భార్య ఆర్తి( Aarti ) మాత్రం తన అనుమతి లేకుండానే తన భర్త విడాకులు( Divorce ) ప్రకటించాడని చెప్పి ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.తాను భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి తాజాగా చెప్పుకొచ్చారు.

జయంరవి ఆర్తి విడాకులకు ఒక ప్రముఖ సింగర్ కారణమని వార్తలు వినిపించగా ఆ సింగర్ మాత్రం వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని వెల్లడించడం జరిగింది.

Advertisement

జయం రవి ఆర్తి మధ్య విబేధాలు చాలాకాలం నుంచి ఉన్నాయని ఆర్తి జయంరవిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరగడం కొసమెరుపు.జయం రవి సోషల్ మీడియా కౌంట్స్ కూడా ఆమె దగ్గరే ఉన్నాయని వార్తలు వినిపించాయి.ఈ వార్తల గురించి ఆర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా ప్రచారం జరుగుతోందని ఆమె అన్నారు.

నన్ను చెడుగా చిత్రీకరించడం ద్వారా నిజాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారని ఆర్తి వెల్లడించారు.నేను మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పు చేశానని భావించవద్దని ఆమె పేర్కొన్నారు.నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని నేను కేవలం హుందాగా ప్రవర్తించాలని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆర్తి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోంది.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..
Advertisement

తాజా వార్తలు