Jayalalitha Ali Khan Pataudi : అతడి పై మనసు పారేసుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ జయలలిత !

జయలలిత.

స్టార్ హీరోయిన్ గా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా, చనిపోయే వరకు బ్రహ్మచారి గా, సంచలనాలకు మారుపేరుగా కొన్నేళ్ల పాటు రాజి లేని జీవితం గడిపింది.

చదువుల తల్లిగా ఉండే జయలలిత భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజు అనుకోలేదు.ఇక చిన్న తనం నుంచి ఆమెకు క్రికెట్ అంటే మహా ప్రాణం.

ఈ విషయం చాల మందికి తెలుసు.చిన్నతనంలో తన తమ్ముడితో పాటు టెస్ట్ మ్యాచులు బాగా చూసేది.

రన్నింగ్ కామెంట్రీ అయితే అస్సలు మిస్ అయ్యేది కాదు.ఆడపిల్లలకు క్రికెట్ ఏంటి అంటే ఆమె నవ్వుకునేది.

Advertisement
Jayalalitha Love About Ali Khan Patoudi , Ali Khan Patoudi, Jayalalitha, Mansoo

కానీ క్రికెట్ ని కనిపెట్టింది ఆడపిల్లలే అని తర్వాత తెలుసుకొని నవ్వుకుందట.ఆ రోజుల్లో ఆమె ఇంటికి డైలీ స్పోర్ట్స్ అండ్ పాస్ట్ టైమ్స్ అనే స్పోర్ట్స్ మ్యాగజిన్ కూడా వచ్చేదట.

మ్యాగజిన్ వచ్చిన గంట లోపే అందులో ఉండే క్రికెటర్ల ఫోటోలు మొత్తం కత్తిరించి ఆమె ఆల్బమ్ లో దాచుకునేదట.కానీ ఎవరు కత్తిరించారో తెలియక ఇంట్లో ఒకటే గొడవ జరిగేది.

ఆమె స్కూల్ లో చదువుతున్న వారికి కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండేదంట.ఆమె స్కూల్ లో అందరికి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే బాగా ఇష్టం ఉండటంతో పటౌడీ ఫాన్స్ క్లబ్ ని కూడా పెట్టుకున్నారట.

ఆ టైం లో ఈ ఫాన్స్ క్లబ్ కి స్పోర్ట్స్ కవర్ చేసే ఫోటోగ్రాఫర్ ఒకతను వారికి నచ్చిన ఫొటోలతో వచ్చి ఒక్కోటి ఐదు రూపాయల చొప్పున అమ్మేవాడట.

Jayalalitha Love About Ali Khan Patoudi , Ali Khan Patoudi, Jayalalitha, Mansoo
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఆ ఫొటోలన్నీ కూడా జయలలిత కొనుక్కునేదట.ఆలా జయలలిత కి పటౌడీ పై వల్లమాలిన ప్రేమ ఉండేది.మరో వైపు ఆమె సీఎం అయ్యాక కూడా రాజకీయాలు కాసేపు పక్కన పెడితే చేసే మరొక పని క్రికెట్ చూసి ఆనందించడం అని ఒక ఇంటర్వ్యూ లో ఆమె తెలిపింది.

Advertisement

ఇక ఎప్పుడు అయితే అలీ ఖాన్ పటౌడీ షర్మిల ఠాకూర్ తో ప్రేమలో పడ్డాడు అని తెలిసాక పటౌడీ ఫాన్స్ క్లబ్ మొత్తం వారి ప్రేమను వారి దగ్గరే పెట్టుకున్నారట.

తాజా వార్తలు