రూ.2.6 కోట్లు పెట్టి ఫెరారీ కొన్నాడు.. గంట తిరిగేలోపే అగ్నికి ఆహుతి.. ఎక్కడంటే..

జపాన్‌లోని టోక్యోలో( Tokyo ) ఓ షాకింగ్ సంఘటన జరిగింది.కళ్ల ముందే కన్న కల కరిగిపోయింది పదేళ్ల కష్టం గంటలోనే బూడిదైపోయింది.

హాంకాన్( Honkon ) అనే 33 ఏళ్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ పదేళ్లుగా కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్నాడు.తన కలల కారు ఫెరారీ 458 స్పైడర్( Ferrari 458 Spider ) కొనాలని అతని ఆశ.జపాన్‌లో ఈ లగ్జరీ కారు ధర సుమారు 43 మిలియన్ యెన్ (మన కరెన్సీలో సుమారు రూ.2.6 కోట్లు).కానీ పాపం, ఎంతో ఆశగా కొనుక్కున్న ఆ కారు, ఇంటికి తెచ్చిన గంటకే పూర్తిగా కాలి బూడిదైపోయింది.

కారు డెలివరీ తీసుకున్న కాసేపటికే ఈ ఘోరం జరిగింది.హాంకాన్ ఆ బ్రాండ్ న్యూ ఫెరారీని టోక్యోలోని మినాటో ఏరియాలో షుటో ఎక్స్‌ప్రెస్‌వేపై నడుపుతున్నాడు.ఇంతలో ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించాడు.

ఏదో తేడా జరిగిందని గ్రహించి, వెంటనే కారును పక్కకు ఆపి బయటకు దూకేశాడు.అదృష్టవశాత్తూ, అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement

అతను సమయానికి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

క్షణాల్లో కారు మంటల్లో చిక్కుకుంది.చూస్తుండగానే భగ్గుమంది.రిపోర్టుల ప్రకారం, కేవలం 20 నిమిషాల్లోనే ఆ లగ్జరీ కారు పూర్తిగా కాలి బూడిద కుప్పగా మారిపోయింది.

రోడ్డుపై వెళ్తున్న ఇతర డ్రైవర్లు తమ వాహనాలను నెమ్మది చేసి, ఆ లగ్జరీ వాహనం నల్లటి గూడుగా మారిపోవడాన్ని షాక్‌తో చూశారు.మంటలు చెలరేగడానికి ముందు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు.

అసలు మంటలకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

జరిగిన దానికి హాంకాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.తన బాధను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. "జపాన్‌లో( Japan ) ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తిని బహుశా నేనేనేమో" అని వాపోయాడు.

Advertisement

మీడియాతో మాట్లాడుతూ, తానెంతో భయపడ్డానని, కారు పేలిపోతుందేమోనని క్షణకాలం భయపడినట్లు చెప్పాడు.ఈ ఘటనలో హాంకాన్‌తో పాటు మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది.

అసలు కారులో మంటలు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది.హాంకాన్‌కు ఆనందాన్ని, సంబరాన్ని ఇవ్వాల్సిన క్షణం,అతనికి జీవితాంతం మరిచిపోలేని ఓ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది.

తాజా వార్తలు