ఎన్డీఏలోకి జనసేన?

వచ్చేసారావత్రిక ఎన్నికలు మిత్రులతో కచ్చితంగా అవసరం ఉంటుందని అంచనా వేస్తున్న కమలనాధులు ఇప్పటినుంచే వారిని ప్రసన్నం చేసుకునే చర్యలు మొదలుపెట్టారు.

ఈనెల 18వ తారీఖున ఎన్డిఏ మిత్రపక్ష సమావేశం జరుగుతుండగా తమకు కలిసి వచ్చే పార్టీలను గుర్తిస్తున్న కమలనాధులు వాటికి ఆహ్వానాలు పంపిస్తున్నారు .

మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఆగిపోతారని సర్వే రిపోర్ట్లు వస్తున్న దరిమిలా ముందు జాగ్రత్త చర్యలుగా మిత్రులను పెంచుకుంటున్న బిజెపి( BJP ) అధిష్టానం కొత్త మిత్రుల కోసం వేట మొదలుపెట్టింది.div class="middlecontentimg">

ప్రస్తుతానికి ఎన్డీఏలో జనతాదళ్, బిజు జనతా దల్ , ఎడిఎంకే వంటి చిన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి అయితే మహారాష్ట్రలో షిండే చీల్చిన శివసేన( Shiv Sena )లోని ఒక వర్గం .ఇటీవల జరిగిన ఎన్సిపి తిరుగుబాటు ద్వారా వచ్చిన వర్గాన్ని కలుపుకొని ఎన్డీఏ కూటమి కొంత బలపడినట్లుగానే తెలుస్తుంది.అయితే పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారినా కూడా తమ రాజ్యాధికారానికి డోకా ఉండకూడదని భావిస్తున్న అధిష్టానం దక్షిణాదిలో కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తుంది.

జగన్ తో మంచి సంబంధాలు నడుపుతున్న కమలనాధులు రాజ్యసభలో తమ బిల్లులు కనుగుణంగా మద్దతు తీసుకుంటున్నారు .అయితే కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే దోరణి అవలంబిస్తున్న జగన్ తమ రాజకీయ సమీకరణాల ప్రకారం బిజెపితో అధికారికంగా ఎన్డిఏ లో కలవలేని పరిస్థితుల్లో ఉండడంతో ఇప్పుడు బిజెపి చూపు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, జనసేన( Jana sena )పై పడినట్లుగా తెలుస్తుంది.జనసేనతో మొదటి నుంచి మిత్రపక్షంగానే ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు రాజకీయ సమాలోచనలు చేసిన పరిస్థితులు గాని ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితులు గాని లేవు .div class="middlecontentimg">

Advertisement

అంతేకాకుండా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తో పెద్దగా చర్చలు సమావేశాలు కూడా కీలక నాయకులైన మోడీ అమిత్ షా ఇంతవరకు జరుపలేదు .అయితే ఇకపై పరిస్థితిలో మార్పు వస్తుందని జనసేన ను క్రియాశీలక భాగస్వామిగా కేంద్ర హైకమాండ్ భావిస్తున్నదని వచ్చే ఎన్నికలలో జనసేన క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అంచనాలు ఉండడంతో జనసేన గ్రాఫ్ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement

తాజా వార్తలు