జనసేనలో మొదలైన ముసలం..ఇది న్యాయమా..పవన్

పవన్ కళ్యాణ్ జనసేనలో లుకలుకలు మొదలయ్యాయా.? పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యయా.? పదవుల కోసం జనసేన నేతలు కొట్టుకున్తున్నారా.

? అంటే అవుననే అంటున్నారు.జనసేనలో కొంతమంది నేతలు.

వారం రోజుల క్రితం పార్టీ ఆవిర్భావ సభని ఎంతో అట్టహాసంగా నిర్వహించిన పవన్ కళ్యాణ్.పార్టీలో ఉన్న అసంతృప్తి పై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా.

తన సొంత ఇంటిలో గొడవలు సరిదిద్దుకోకుండా అందరికీ నీట్లు చెప్తున్నాడు అంటూ విమర్శలు మొదలయ్యాయి.ఇదిలాఉంటే పార్టీలో కుమ్ములాడుకుంటున్న కొందరు నేతలవలన పవన్ పరువు అడ్డంగా పోతోంది అనడంలో సందేహం లేదు.

అసలు ఎందుకు పవన్ పై ఈ స్థాయిలో విమర్శలు.జనసేనపై ఎందుకు ఈ కామెంట్స్ వస్తున్నాయి అంటే.? కుల రాజకీయలకి నాకు ఆమడ దూరం అని చెప్పుకుంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ .తన చుట్టూ మాత్రం తన కులానికి సంభందించిన కాపు వర్గం వారిని నియమించుకుంటూ జనసేన మొత్తాన్ని నింపేశారు.ఇక జిల్లాల్లో జ‌న‌సేన సేవాద‌ళ్ కో ఆర్డినేట‌ర్ల‌లో ఉండే వాళ్ల‌కు కూడా ప‌వ‌న్ సొంత కులానికే చెందిన వారు ఎక్కువుగా ఉంటున్నారు.

Advertisement

ఓవ‌రాల్‌గా చూస్తే ప‌వ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీలో కీల‌క వ్య‌క్తుల నుంచి, జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన వారిని చూసినా 90 శాతం కాపు కులానికి చెందిన వారే ఉండటం జనసేన అధినేత చెప్పే మాటలకి చేస్తున్న పనికి ఎక్కడా పొంతన లేదని చెప్పవచ్చు.మరి కులాలకి అతీతమైనది జనసేన అంటూ చెప్పే పవన్ మరి జనసేనలో ఉన్న సొంత కుల నంబరింగ్ మీద ఎలాంటి సంధానం ఇస్తాడు.? ఇదిలాఉంటే పార్టీ యొక్క సంస్థాగ‌తంగా నిర్మాణం సరిగా లేనే లేదు కానీ ముస‌లం మొద‌లైంద‌ని పార్టీ వ‌ర్గాలే చెపుతున్నాయి.ప‌వ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీలో ఒక‌రంటే ఒక‌రికి పొస‌గ‌ని ప‌రిస్థితి వీరిలో ఎవ‌రికి వారు ప‌వ‌న్ ద‌గ్గ‌ర వ్య‌క్తిగ‌త ప్రాప‌కం కోసం పోటీప‌డుతూ ఎవ‌రికి వారు ఓ కోట‌రీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

పవన్ ని ఎవరు కలవాలన్నా సరే హై కమాండ్ అంతా వీళ్ళే అన్నట్లుగా వీళ్ళు వేసే ప్రశ్నలు.పెట్టె హింసా అతి పెద్ద టార్చర్ చూపిస్తుంది.ఇక జిల్లాల్లో జరిగే గొడవలు అంతా ఇంతా కాదు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జ‌న‌సేన సేవాద‌ళ్ కో ఆర్డినేట‌ర్ బాధ్య‌త‌లు తాడేప‌ల్లిగూడేనికి చెందిన ఓ వ్య‌క్తికి అప్ప‌గించారు.

అతని ప్రవర్తన సరిగా లేని కారణంగా అతడికి వార్నింగ్ ఇచ్చారట కూడా.దాంతో మీకో దణ్ణం అంటూ పార్టీకి దూరంగా ఉంటున్నాడట.

గుంటూరు లో ప్ర‌జారాజ్యం సమయంలో ఎంతో బాగా పని చేసి, ఎన్నిక‌ల్లో పోటీచేసిన వారి చేతుల్లో పూర్తిగా పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.వాళ్లు గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ప‌నిచేశారు… అంత‌కుమించి ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం వారే… వాళ్ల కంపెనీల ద్వారా రైతుల‌ను ముంచేశార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

అయితే ప‌వ‌న్ ఇప్పుడు వారికే గుంటూరు జిల్లాలో జ‌న‌సేన ప‌గ్గాలు ఇవ్వాల‌నుకోవ‌డం పార్టీలో పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది.అసలు పార్టీ గ్రౌండ్ లెవెల్ లో సరిగా రూపు దిద్దుకోకుండానే ఇన్ని లుకలుకలు బయటపడుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కుల ముద్ర పడటం కూడా జనసేనకి ఎంతో నష్టం తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు.

Advertisement

కులాలకి అతీతుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కోటరీలో అందరు తన వర్గం వారే కావడం ఎంత వరకూ న్యాయం అనేది పవన్ కి పవనే ప్రశ్నించుకోవాలి.

తాజా వార్తలు