ఎన్టీఆర్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు ... వైరల్ !

జనం నోట్లలో బాగా నానడం ద్వారా ఈ ఎన్నికల్లో సులువుగా గెలుపొందవచ్చు అనే ఆలోచనతో.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుందూకుగా.

ముందుకు వెళ్తున్నారు.దీని కారణంగానే.

తనకు రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వారందరిని టార్గెట్ గా చేసుకుని వారి మీద సంచలన ఆరోపణనలు చేస్తున్నాడు.ఈ సందర్భంగా.

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.

Advertisement

ఎన్టీఆర్ లా తాను అహంకారాన్ని తలకెక్కించుకోనని పవన్ చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు