ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసిన జనసేన

జనసేన( Jana sena ) స్పీడ్ పెంచింది.

ఒకపక్క పొత్తుల అంశంపై క్లారిటీ రాకపోయినా, అప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తూ, తమతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్న టిడిపికి షాక్ ఇస్తున్నారు.

వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ తీసుకున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి వైసిపి ప్రభుత్వం ఏర్పడకుండా చూడాలనే పట్టుదలతో ఉన్నారు.

అందుకే వైసిపి వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేసే పనిలో నిమగ్నం అవుతూనే,  మరో పక్క సొంతంగానైనా పార్టీని ఎన్నికలకు తీసుకువెళ్లి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు.ఒకపక్క బీజేపీతో పొత్తు కొనసాగిస్తునే టిడిపి తోను పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

మూడు పార్టీలు కలిస్తే అధికారంలోకి వస్తామనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.ఇక అధికార పార్టీ వైసీపీ విషయంకొస్తే , 175 స్థానాలకు 175  గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ, అదే టార్గెట్ గా పెట్టుకుంది.

Advertisement

ఒకపక్క టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర చేస్తుండగా,  మరోవైపు పవన్ యాత్ర చేస్తూ ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు .

ఇది ఇలా ఉంటే తాజాగా జనసేన కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఈ మేరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan klayan )నియమించారు.వారికి నియామక పత్రాలు స్వయంగా అందించారు.

  వచ్చే ఎన్నికల్లో వీరే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.పిఠాపురం ,రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు.

 తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ -పిఠాపురం( Uday Srinivas Tangella ), బత్తుల రామకృష్ణ రాజనగరం, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ కొవ్వూరుకు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ను నియమించారు.ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలలోను వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారు.మరికొన్ని నియోజకవర్గాల విషయంలో క్లారిటీకి రావాలని,  త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో జనసేన అధినేత ఉన్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు