డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం

ఏపీలో వచ్చే నెల 1వ తేదీన జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జనసేన - టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాపై జనసేన నేతలు సమావేశంలో చర్చించనున్నారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు