అవతార్-2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన హాలీవుడ్ దర్శకుడు

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

ఆయన 2009 లో తెరకెక్కించిన అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలక్షన్స్ వసూలు చేసి,రికార్డ్ లు సృష్టించిందో అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతుంది.ఈ సినిమాకు కొనసాగింపుగా మరో 4 సీక్వెల్స్ ఉంటాయని అప్పుడే ప్రకటించిన ఆయన అవతార్-2 విడుదల తేదీని ప్రకటించారు.ట్విట్టర్ ద్వారా ఆ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది అన్న విషయాన్ని వెల్లడించారు.2021 డిసెంబర్ 17 న అవతార్-2 ని రిలీజ్ చేస్తామంటూ ఆయన ట్విట్టర్ లో తెలిపారు.అవతార్ చిత్రంలో సహజవనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం,అక్కడ నావీ అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం,వారికి హీరో సాయం వంటి పలు ఆసక్తి కార మలుపులతో సాగిపోయిన సంగతి తెలిసిందే.

James Cameron Speaks About Release Date Of Avatar 2 2

దాదాపు రూ .1,648 కోట్ల తో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఏకంగా ఈ చిత్రం రూ.20,455 కోట్ల మేరకు కలెక్షన్ ల వర్షం కురిపించింది.అయితే అవతార్-2 మాత్రం పాండోరా గ్రహం పై ఉన్న సముద్రాలపై ఉంటుంది అని తెలుస్తుంది.

అందుకే ఈ చిత్రానికి అవతార్-ది వె ఆఫ్ వాటర్ అనే పేరు పెట్టె అవకాశం ఉన్నట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఏది ఏమైతే ఏంటి 2021 లో ఈ చిత్రం ధియేటర్ల లో అలరించనుంది అన్నమాట.

Advertisement
James Cameron Speaks About Release Date Of Avatar 2 2-అవతార్-2 ర�
పెద్దలు చక్కెర తినడం కన్నా బెల్లం తినడం మేలు అంటారు ఎందుకో తెలుసా...?

తాజా వార్తలు