జగ్గారెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ లో కలకలం...అసంతృప్తులు బయటికి వచ్చేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు, వివాదాస్పద కామెంట్స్ అనేవి కొత్తవి కాకపోయినా తాజాగా జగ్గారెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి రాజీనామా అనేది ఒక్కసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చర్చనీయాంశంగా మారింది.

అయితే జగ్గారెడ్డి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉన్న నేతలు ఇప్పుడు ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉంది.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత తనతో కలిసి వచ్చే నేతలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ కలిసిరాని నేతలకు ప్రాధాన్యత ను తగ్గిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది.

అందులో భాగంగానే కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న నేతలు ఇక మనస్తాపంతో కాంగ్రెస్ నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ కి పీసీసీ పగ్గాలు ఇచ్చిన తరువాత ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నేతలు కొంత అసంతృప్తికి గురవుతారని కాంగ్రెస్ హై కమాండ్ కు ముందే తెలుసునని అందుకే కాంగ్రెస్ సీనియర్ ల అభిప్రాయాలను అంతగా పరిగణలోకి తీసుకోలేదని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున  చర్చ జరిగింది.

Jaggareddy Resignation Decision Has Caused A Stir In The Congress Details, Telan

అయితే ఇక హై కమాండ్ భావించినట్టుగా చాలా మంది సీనియర్ లు మౌనం వహించడం ఒకరిద్దరు నేతలు మాత్రమే కొద్దిగా బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిగా తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు అనేవి తారా స్థాయికి చేరిన పరిస్థితి ఉంది.అయితే ఇక జగ్గారెడ్డిలా అసంతృప్తిగా ఉన్న మరికొంత మంది నేతలు ఇదే దారిలో నడుస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటున్న పరిస్థితిలో ఇప్పుడే రాజీనామా లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement
Jaggareddy Resignation Decision Has Caused A Stir In The Congress Details, Telan
Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

తాజా వార్తలు