టీడీపీ ఊహించిన దానికంటే దారుణంగా జగన్ పాలన..

ఏపీ సీఎం జగన్ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోందా ? జగన్ వేయి తప్పులు చేసారంటూ ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసిందా ?అంటే అవుననే చెప్పుకోవాలి.

సీఎం జగన్ రెడ్డి తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారంటూ తెలుగుదేశం పార్టీ ప్రజా ఛార్జిషీట్ ఆరోపిస్తోంది.

జగన్ ది విధ్వంస పాలన అని తెలుగుదేశం పార్టీ అభివర్ణించింది.జగన్ పాలన నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాల మిశ్రమమని చెబుతూ ఒక ప్రత్యేక సంచికను.

టీడీపీ నేతలు విడుదల చేశారు.ప్రజా వేదిక కూల్చివేత, అమరావతి ఉసురు తీయడంతో మొదలైన విధ్వంసక పాలన నిరాటంకంగా కొనసాగుతోందని నేతలు దుయ్యబట్టారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అడుగడుగునా ఘోరాలు, విధ్వంసాలు, నేరాలు, లూటీలు, అబద్ధాలే తప్ప.అభివృద్ధికి తావే లేదని ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం మండిపడుతోంది.

Advertisement
Jagan's Rule Worse Than TDP Expected, TDP, Jagan, CM Jagan Reddy, Amravati, TDP

రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో కూడా ఇవే విమర్శలు చేశారు.ఆ మాట కొస్తే జగన్ గద్దె ఎక్కిన రెండో నెల నుంచే టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది.

ఆ విమర్శల స్థాయి ఇపుడు తారాస్థాయికి చేరుకుంది.తెలుగు దేశం నేతల్లో జగన్ ను విమర్శించని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

Jagans Rule Worse Than Tdp Expected, Tdp, Jagan, Cm Jagan Reddy, Amravati, Tdp

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ వాయిస్ మరికొంత పెంచింది.జగన్‌ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది.ఏపీ సర్వనాశనమై ప్రజలు ఈసురోమంటున్నారు.

టీడీపీ ఊహించిన దానికంటే దారుణంగా జగన్ పాలన సాగింది.మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

అమరావతిని ఒక కులానికి, ప్రాంతానికి ఆపాదించి దుష్ప్రచారం చేశారు.మత విద్వేషాలకు ఆజ్యం పోశారు.

Advertisement

వారేమైనా ఉగ్రవాదులా? అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల్ని ధ్వంసం చేయించారు.స్వయంగా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించారు.

దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుని, ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు అని టీడీపీ నేతలు అంటున్నారు.

తాజా వార్తలు