జగన్ సర్కార్ కొత్త టికెట్ల జీవోలో షాకింగ్ ట్విస్టులు ఇవే.. వాళ్లకు లాభం లేదంటూ?

టాలీవుడ్ సినీ ప్రముఖులు గత కొన్ని నెలలుగా కొత్త టికెట్ల జీవో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త టికెట్ల జీవో విడుదలైంది.

గత నెలలోనే ఈ జీవో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల జీవో విడుదల ఆలస్యమైంది. ఏపీ ప్రభుత్వం గతంతో పోలిస్తే టికెట్ రేట్లను పరవాలేదనే స్థాయిలో పెంచింది.

అయితే జగన్ సర్కార్ కొత్త టికెట్ల జీవోలో షాకింగ్ ట్విస్టులు ఉన్నాయి.ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు సంబంధించి అమలు విషయంలో కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

ఏపీలో టికెట్ రేట్లు కనిష్టంగా 20 రూపాయలుగా ఉండగా గరిష్టంగా 250 రూపాయలుగా ఉన్నాయి.ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు అదనంగా జీఎస్టీ వసూలు చేయనుంది.

Advertisement
Jagan Sarkar New Go Shocking Twists Details Here , Jagan Sarkar , New Go , Sh

అయితే ఏసీ థియేటర్లకు, నాన్ ఏసీ థియేటర్లకు నిర్వహణ ఛార్జీలతో పాటు, ఆన్ లైన్ బుకింగ్ ఛార్జీలు కూడా టికెట్ రేట్లలోనే కలిసి ఉంటాయి.

Jagan Sarkar New Go Shocking Twists Details Here , Jagan Sarkar , New Go , Sh

ప్రతి థియేటర్ లో కనీసం 25 శాతం సీట్లను నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ప్రభుత్వం నిబంధనను విధించడం గమనార్హం.ప్రభుత్వం ఎయిర్ కూల్ థియేటర్లను సింగిల్ కేటగిరీ ఏసీ థియేటర్ల జాబితాలో చేర్చింది.రెండేళ్ల వరకు ఏసీ ఛార్జీలను అమలు చేసుకునేందుకు ఈ థియేటర్లకు అనుమతి ఉంది.

జీవోలో ప్రభుత్వం కొత్తగా స్పెషల్ కేటగిరీ థియేటర్స్ ను తీసుకొచ్చింది.మల్టీప్లెక్స్ తరహా వసతులు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రభుత్వం వేరే టికెట్ రేట్లను ప్రకటించింది.

అయితే గ్రామ, నగర పంచాయితీలలో ప్రీమియర్ టికెట్ 40 రూపాయలుగా ఉండగా నాన్ ప్రీమియర్ టికెట్ 20 రూపాయలుగా ఉంది.ఏపీ అంతటా పవర్ బిల్, డిజిటల్ ట్రాన్స్ మిషన్ ఒకే విధంగా ఉండటంతో కొత్త జీవో వల్ల ఈ థియేటర్లకు పెద్దగా ప్రయోజనం చేకూరదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు