జేపీకి సీటు సిద్ధం చేసిన జగన్ ? వైసీపీ లో చేరుతున్నారా ?

మాజీ ఐఏఎస్, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ( Jayaprakash narayana ) కు సంబంధించిన ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లుగా జేపీ వ్యవహరిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంతో పాటు, అనేక పథకాల పైన జెపి ప్రశంసలు కురిపిస్తున్నారు.ముఖ్యంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

దీనిపైనా జెపి బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు.మరి కొన్ని విషయాల్లో నిర్ణయాలు మార్చుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.ఇక జేపీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకుంటే .2009 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా జేపీ గెలుపొందారు.రాష్ట్ర విభజన తర్వాత 2014లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

తర్వాత క్రియాశీలక రాజకీయాలకు జేపి దూరంగా ఉంటున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉండగానే, తాజాగా జెపి విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.అదే కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్( cm JAGAN ) తో ముచ్చటించారు.

Advertisement

ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన జగన్, ప్రముఖుల్లో ఆసీనులైన జేపీని తన వద్దకు తీసుకురావాల్సిందిగా మంత్రి జోగి రమేష్ కు సూచించారు.జేపీ వేదిక పైకి రాగానే జగన్ లేచి నిలబడి ఆయనకు కరచాలనం చేశారు.

తన పక్క సీట్లోనే కూర్చోబెట్టుకుని అనేక అంశాలపై ఆయనతో చర్చించారు.జెపి చెప్పే విషయాలను జగన్ శ్రద్ధగా వినడం, నవ్వుతూ ఆయనతో మాట్లాడడం వంటివన్నీ చరిన్చానీయాంశం గా మారాయి.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్లే సమయంలోనూ జెపి వద్దకే జగన్ వెళ్లి అనేక విషయాలపై చర్చించారు.దీంతో జెపి వైసిపికి ( ycp )దగ్గరవుతున్నట్లుగా వ్యవహారం కనిపించింది.ఇది ఇలా ఉంటే జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరితే ఆయనను విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట.

వైసీపీలో చేరేందుకు జేపీ సిద్దమనే సంకేతాలు ఇస్తే .ఎంపీ సీటు జగన్ సిద్ధంగా ఉంచారట.దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది జేపీనే.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు