కొత్త  మంత్రి వర్గాన్ని ఈ విధంగా ఎంపిక చేశారా ?

మంత్రివర్గ విస్తరణ విషయంలో రోజుకో రకమైన వార్తలు వస్తూనే ఉన్నాయి.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రివర్గాన్ని జగన్ కూర్పు చేయబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారందరినీ తప్పించబోతున్నారని,  వారి స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది.2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణ ఎవరు ఊహించని విధంగానే ఉంది.సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

కులాల ఆధారంగా మంత్రులకు పదవులను కట్టబెట్టారు.దీనికోసం తనకు అత్యంత సన్నిహితులైన వారిని జగన్ పక్కన పెట్టారు.

దీంతో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని జగన్ సన్నిహిత ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.అయితే జగన్ మాత్రం ఈసారి సామాజిక వర్గాల లెక్కల ఆధారంగానే తన కేబినెట్లో చోటు కల్పించబోతున్నారట.

కొత్త మంత్రివర్గంలో దాదాపు 10 మంది వరకు బిసి మంత్రులు ఉండబోతున్నారట.బీసీ సామాజిక వర్గం ఎక్కువ టిడిపి వైపు మొదటి నుంచి ఉండటం , 2019 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం లో చీలిక వచ్చి వైసీపీ వైపు నిలబడినా, పూర్తిస్థాయిలో వారి అండదండలు వైసీపీకి ఉండాలనే ఉద్దేశంతో బీసీల ప్రాధాన్యాన్ని జగన్ పెంచాలని చూస్తున్నారు.

Advertisement
Jagan Is Going To Form The Ap Cabinet In This Way Details, Ap Ministers, Ap Cabi

అందుకే గతంలో బీసీ సామాజికవర్గానికి మంత్రి పదవులు ఇచ్చినా ఈసారి మరిన్ని పెంచాలని చూస్తున్నారట.వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి కొత్త మంత్రివర్గంలో చోటు  కనిపించబోతున్నట్టు సమాచారం.

ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.

Jagan Is Going To Form The Ap Cabinet In This Way Details, Ap Ministers, Ap Cabi

వాటిల్లోనూ ఎక్కువగా ఎస్సీ,  ఎస్టీ బీసీలకు ప్రాధాన్యాన్ని కల్పించారు.ఇక మైనారిటీలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూనే మొత్తం పంతొమ్మిది మంది వరకు ఉండే అవకాశం ఉందని కొంతమంది వైసీపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం పెంచే క్రమంలో సొంత సామాజిక వర్గానికి చెందిన తనకు అత్యంత సన్నిహితులైన వారిని జగన్ పక్కన పెడుతూ ఉండడం పై ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.

వైసిపి ఏర్పాటు సమయం నుంచి అధికారంలోకి వచ్చే వరకు పూర్తిగా అండదండలు అందించిన రెడ్డి సామాజిక వర్గం జగన్ తీరుపై కాస్ట్ అసంతృప్తితోనే ఉందట.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు