ఆ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో బాబును కాపీ కొడుతున్న జ‌గ‌న్..!

ముఖ్య‌మంత్రి పాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంపై ప్రతిప‌క్షాలు కూడా ఫోక‌స్ ఎక్కువ‌గానే పెడుతుంటాయి.అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తుంటారు.

అలాగే ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు కూడా ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్య‌ర్థిని ఓడిస్తామ‌ని.అన్ని స‌మ‌స్య‌లు తీరుస్తామ‌ని చెప్తుంటారు.

ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు.ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుపై త‌మ అభ్య‌ర్థిని గెలిపిస్తే మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తాన‌ని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును సైతం కుప్పంలో ఓడిస్తామని జగన్ తన పార్టీ నేతలకు చెబుతున్నారు.అన్నీటికి అన్ని సీట్లు మ‌న‌వేన‌ని చెప్పుకుంటున్నారు.

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మండల పరిషత్, జ‌డ్పీటీసీ, మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది.ఇప్పుడు కుప్పంలో టీడీపీని పూర్తిగా ఖాళీ చేయాల‌ని చూస్తోంది.

ఈ క్ర‌మంలోనే కుప్పం నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద మంది క్రియాశీలక కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు.ప్రస్తుతం కుప్పం ఇన్చార్జిగా ఉన్న భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని కార్యకర్తలకు చెప్పారు.

అయితే వీరిలో కార్యకర్తల కంటే మండల, గ్రామ పార్టీల అధ్యక్షులు, వివిధ మార్కెట్ యార్డుల చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయాల పాలక సంస్థల చైర్మన్లే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.వీరిలో నిజమైన క్షేత్ర స్థాయి కార్యకర్త ఒక్కరు కూడా లేరని అంటున్నారు.

పులివెందుల లాగే కుప్పం.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

తనకు పులివెందుల ఎలాగో కుప్పం కూడా అలాగే అంటూ సెంటిమెంట్ డైలాగులను జగన్ చెబుతున్నార‌ట‌.గతంలో ఇలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులకు కూడా తాము నీళ్లు ఇచ్చామని.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్క‌డి రైతులను పట్టించుకోలేదని తమ ప్రభుత్వమే నీళ్లు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు.

Advertisement

అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డినే ఓడించి పులివెందుల గడ్డపై షాక్ ఇచ్చారు.అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ చంద్రబాబు ఊహించ‌ని ఫలితాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు మాదిరిగానే పులివెందులలానే కుప్పం కూడా తనకు ముఖ్యమంటూ చెబుతున్నారు.తొంద‌ర్లోనే దాదాపు రూ.40 కోట్లు ఇస్తున్నానని.నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకోమని చెప్పారు.

అంతేకాకుండా ఎమ్మెల్సీ భరత్ తన తరఫున దీన్ని పర్యవేక్షిస్తారని చెబుతున్నార‌ట‌.అయితే అప్పుడు పులివెందుల‌లో జ‌గ‌న్ ఎలా షాక్ ఇచ్చారు.

ఇప్పుడు జగన్ కు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో షాక్ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.సెంటిమెంట్ ని కాపీ కొట్టినా వ‌ర్కౌట్ కాద‌ని అంటున్నారు.

తాజా వార్తలు