వారి నోటికి జగన్‌ తాళం వేశాడా?

ఏపీ సీఎం జగన్‌ తన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మరియు మంత్రులను మరియు కొందరు నాయకులను రహస్యంగా హెచ్చరించాడని, మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడటం ఇక మానుకోవాలంటూ హెచ్చరించాడట.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ఏం మాట్లాడినా నడిచింది.

కాని ఇప్పుడు అలా కాదు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ జగన్‌ సూచించినట్లుగా తెలుస్తోంది.రోజా, చెవిరెడ్డి, కొడాలి నానితో పాటు ఇంకా కొందరు ముఖ్య నాయకులు అప్పట్లో తెగ మాట్లాడేవారు.

Jagan Give The Warning To Ycp Mlas-వారి నోటికి జగన్

తెలుగు దేశం పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వారు తమ మాటలతో అవతలి వారిని నోరు మూయించే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

గత మూడు నాలుగు నెలలుగా వీరు అసలు మీడియా ముందు కనిపించడమే చాలా అరుదు అయ్యింది.వైకాపా ముఖ్య నాయకులు ఎవరు కూడా గతంలో మాదిరిగా చాలా ఎగ్రసివ్‌గా మాట్లాడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

Advertisement

తెలుగు దేశం పార్టీ నాయకులను టార్గెట్‌ చేసేందుకు వైకాపా నాయకులు ఆసక్తిగా ఉన్నారు.కాని జగన్‌ మాత్రం వారి నోటికి తాళం వేసి ఆపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

చుండ్రును తరిమికొట్టే గ్రీన్ టీ.. ఎలా వాడాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు