చీరాల పంచాయి‌తీపై మంత్రి బాలినేనికి జ‌గ‌న్ క్లాస్...‌!

ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాల‌పై చాలా రోజుల త‌ర్వాత‌.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర పంచాయి‌తీ జ‌రిగింది.

తాజాగా ఈ విష‌యాల‌పై మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో సీఎం చ‌ర్చించార‌ని.పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Jagan Class For Minister Balineni On Chirala Panchayat,ap,ap Political News,chir

ముఖ్యంగా ఇక్క‌డ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంను పార్టీకి సానుభూతి ప‌రుడుని చేసుకున్న త‌ర్వాత.పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోవ‌డంపై సీఎం జ‌గ‌న్ ఒకింత సీరియ‌స్‌గానే స్పందించార‌ని అంటున్నారు.

పైగా ఆయ‌నతో పార్టీకి ఇబ్బందే త‌ప్ప‌.మంచి జ‌ర‌గ‌డం లేద‌ని కింది స్థాయి నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో మంత్రి బాలినేనికి క్లాస్ ఇచ్చార‌ని అంటున్నారు.

Advertisement

``చీరాల‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది?`` అని సీఎం జ‌గ‌న్ బాలినేని‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై.దాదాపు 40 నిముషాల‌పాటు చ‌ర్చించార‌ని అంటున్నారు.

ఏదైనా ఉంటే.మీరు ఎందుకు స‌ర్ది చెప్ప‌లేక పోతున్నారు.

ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు వ‌చ్చాయి.కొన్ని చోట్ల కోర్టు తీర్పుతో వాయిదా ప‌డినా మిగిలిన చోట్ల ప‌రిస్థితి ఏంటి ?  అని ప్ర‌శ్నించార‌ట‌.దీనికి బాలినేని పోటా పోటీగా ఇద్ద‌రూ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గాలు నామినేష‌న్లు వేసుకున్న విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

ప‌లు మేజ‌ర్ పంచాయ‌తీల్లో ఇద్ద‌రు నాయ‌కుల ఫ్యానెల్స్ పోటీలో ఉన్న విష‌యాన్ని ఆయ‌న సీఎంకు వివ‌రించ‌డంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.అలా ఎందుకు జ‌రుగుతోంది? అనిప్ర‌శ్నించారు.`` మ‌న‌లో మ‌నమే పోటీ ప‌డితే.

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎప్పుడు క‌ట్ట‌డి చేస్తాం.ఇలా అయితే .క‌ష్ట‌మే!`` అని బాలినేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన‌ట్టు వైసీపీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది.ఇద్ద‌రు నేత‌లు .ఎవ‌రు ఎంత‌టి వారైనా.పార్టీ లైన్‌ను అతిక్ర‌మిస్తే.

Advertisement

చ‌ర్య‌లు తీసుకోండి.పార్టీలో సీనియ‌ర్ల‌కు విలువ ఇవ్వాల్సిందే.

పార్టీలోకి తీసుకుంది.మ‌రింత వివాదం పెంచ‌డానికి కాద‌నే విష‌యాన్ని అంద‌రికీ చెప్పాల‌ని సూచించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.ఈ విష‌యంపై ఇప్ప‌టికే రెండు సార్లు ఇద్ద‌రినీ కూర్చోబెట్టి మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించామ‌ని.

అయినా స‌మ‌స్య స‌ర్దుబాటు కాలేద‌ని బాలినేని అన‌డంతో.జ‌గ‌న్ ఇక‌పై ఇలాంటివి నా దాకా రాకుండా చూడాల్సిన బాధ్య‌త నీదే! అని ఒకింత సీరియ‌స్‌గానే చెప్పార‌ని తెలుస్తోంది.

మ‌రి బాలినేని ఏం చేస్తారో చూడాలి.

తాజా వార్తలు