జగన్ : బీజేపీకి దూరంగా ... కూటమికి దగ్గరగా  ?

బీజేపీ విషయంలో వైసిపి అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) వైఖరి లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

గతంలో బిజెపితో ఎప్పుడూ నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా,  2019 నుంచి 24 వరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వైసిపి అన్ని రకాలలను మద్దతు తెలిపింది .

కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపింది.

Jagan: Away From Bjp Closer To Alliance, Tdp, Ysrcp, Ap, Cbn, Chandrababu, Pavan

 అయినా బీజేపీ నేతలు తను విషయంలో అన్యాయమే చేశారనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.ఇటీవల కాలంలో బిజెపి పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో,  జగన్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న విమర్శలు దీనికి నిదర్శనంగా కనిపి స్తున్నాయి.2014 టిడిపిని, 2019లో వైసీపీని అన్ని రకాలుగా వాడుకుని బిజెపి పక్కన పెట్టిందని,  ఈ విషయంలో చంద్రబాబు తో పాటు,  తాను కూడా మోసపోయానని జగన్ భావిస్తున్నారు.2024 ఎన్నికల్లో టిడిపి ,జనసేన లతో బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని జగన్ భావించినా,  బిజెపి మాత్రం ఆ రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది.

Jagan: Away From Bjp Closer To Alliance, Tdp, Ysrcp, Ap, Cbn, Chandrababu, Pavan

 అయినా జగన్ మాత్రం తాము ఒంటరిగానే 185 స్థానాల్లోనూ గెలుస్తామనే ధీమా ను  వ్యక్తం చేశారు.ఎన్నికల ఫలితాలలో 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం కావడం జగన్ కు మింగుడు పడడం లేదు.   అన్ని రకాలుగా వాడుకొని బిజెపి( BJP ) తమను మోసం చేసిందనే అభిప్రాయానికి వచ్చిన జగన్ బిజెపికి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారట.

Advertisement
Jagan: Away From BJP Closer To Alliance, TDP, YSRCP, AP, CBN, Chandrababu, Pavan

  మొదటి నుంచి కాంగ్రెస్ కు ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తున్న జగన్ ప్రస్తుత వైఖరి చూస్తే ఇండియా కూటమికి దగ్గరయ్యే విధంగానే వ్యూహ రచన చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది.తనను అన్యాయంగా జైలుకు  కాంగ్రెస్ పెద్దలు పంపించారు అని,  దీంతో పాటు  , ఏపీ , తెలంగాణ విభజనకు కాంగ్రెస్ కారణమని, ఈ విషయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉందని , ఆ పార్టీకి ఎప్పుడు దగ్గరే ప్రయత్నం కూడా జగన్ చేయలేదు.

ప్రస్తుతం బిజెపి,  టిడిపి , జనసేనకు పూర్తిస్థాయిలో అన్ని విషయాల్లో మద్దతు పలుకుతూ ఉండడంతో,  ఢిల్లీ స్థాయిలో తమకు ఏదో ఒక ఆసరా అవసరమని జగన్ భావిస్తున్నారు .ఈ నేపద్యంలోనే ఇండియా కూటమి వైపు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.అయితే ఆ మద్దతు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇవ్వాలని భావిస్తున్నారట.

అందుకే హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల వల్లే అంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలకు జగన్ మద్దతు పలకడం చూస్తుంటే , ఇండియా  కూటమికి పరోక్షంగా మద్దతు ఇచ్చేలా జగన్ వైఖరి కనిపిస్తోంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు