మరోసారి ప్రేమలో పడిన జబర్దస్త్ రోహిణి... ప్రియుడిని పరిచయం చేసిందిగా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎన్నో సీరియల్స్ లో నటిగా నటిస్తూ అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటి రోహిణి(Rohini) ఒకరు బిగ్ బాస్ తర్వాత ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం రోహిణి జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

వీటితో పాటు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఈమె తన స్టైల్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి రోహిణి గత కొద్దిరోజుల క్రితం తనకు ఫస్ట్ లవ్ ( First Love ) బ్రేకప్ అయ్యిందని తనని ప్రేమించిన వాడు దారుణంగా మోసం చేశారని ఆ సమయంలో తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ తన ఫస్ట్ లవ్ బ్రేకప్ గురించి తెలియజేశారు.అయితే తాజాగా ఈమె మరోసారి ప్రేమలో పడిందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన ప్రియుడిని ఈమె బుల్లితెర కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది.

ప్రతి ఆదివారం ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama company ) కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పటిలాగే తమ అద్భుతమైన కామెడీతో అందరిని నవ్వించారు.ఇకపోతే వేదికపై రోహిణి మాట్లాడుతూ నన్ను సీరియస్ గా తీసుకోనే వాళ్లు ఉన్నారు కనుక వారి కోసం ఈ పాట అంటూ ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ అనే పాటను వేదికపై పాడారు.

ఇలా ఈమె పాట పాడుతున్న తరుణంలో వెనకనుంచి ఓ వ్యక్తి వచ్చారు అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ చేశారు.బహుశా ఈమె తన ప్రియుడిని వేదికపై అందరికీ పరిచయం చేయబోతున్నారని అందుకే ప్రోమో ఇలా కట్ చేశారు అంటూ నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి నిజంగానే ఈమె తన ప్రియుడిని పరిచయం చేయబోతోందా అనే విషయం తెలియాలి అంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు