జబర్దస్త్ షో.గత కొన్ని నెలలుగా ఈ షోలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో? తెలియని పరిస్థితులు.
జబర్దస్త్ నుంచి ఒక్కొక్క కమెడియన్ వెళ్ళిపోతున్నారు.
కాగా ఇప్పటికే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి కమెడియన్లు జబర్దస్త్ ను వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.కాకా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన కమిటీలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ రెగ్యులర్ కమెడియన్ గా కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రేజ్ అందుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది పేర్లు టాప్ లిస్టులో కనిపిస్తున్నాయి.కాగా జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వకముందు సుడిగాలి సుధీర్ ఎలాంటి కష్టాలను అనుభవించాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
మొదట మెజీషియన్ గా కిరీర్ ని మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా అంచలంచెలుగా ఎదుగుతూ డాన్సర్ గా,మెజీషియన్ గా, కమెడియన్ గా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు సుడిగాలి సుధీర్.
అయితే సుడిగాలి సుధీర్ కు మొదట్లో జబర్దస్త్ లో అనుకున్న విధంగా అంత ఈజీగా అవకాశాలు దొరకలేదు.జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అయిన వేణు మొదట సుధీర్ నీ స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఉపయోగించుకున్నాడు.
ఇక ఆ సమయంలో సుధీర్ చాలా తక్కువ పారితోషికాన్ని అందుకునేవాడు.అలా స్క్రిప్ట్ రైటింగ్ కోసం మొదట్లో సుధీర్ ఒక ఎపిసోడ్కి రెండువేల నుంచి మూడు వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారట.హైపర్ ఆదికి కూడా జబర్దస్త్ లో అంత సునాయాసంగా అయితే అవకాశం రాలేదు.
ప్రస్తుతం కమెడియన్లలో టాప్ లిస్టులో ఉన్న హైపర్ ఆది ఒకప్పుడు స్కిప్ రైటర్ గా కూడా పనిచేశాడు.అదిరే అభి ద్వారా జబర్దస్త్ కి పరిచయమైన హైపర్ ఆది ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా హైపర్ ఆది మొదట్లో స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఒక్క ఎపిసోడ్ కు 2000 రూపాయలు మాత్రమే ఇచ్చారట.అలా మొదట్లో 2000 రూపాయలు పారితోషకం అందుకున్న హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో ఒకరిగా నిలిచాడు.
ప్రస్తుతం హైపర్ ఆది ఒక్కొక్క ఎపిసోడ్ కి దాదాపుగా లక్షకు పైగానే రెమ్యునరేషన్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం సినిమాలకు కూడా అతను ఒక్క రోజుకు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy