సెల్ఫీలు దిగే మొహం కాదు నాది.. జబర్దస్త్ ఫైమా కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా స్కిట్ కోసం ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

జబర్దస్త్ షోలో మూతి, ముక్కు వంకర్లు తిప్పుతూ ఒక రకమైన కామెడీని పండిస్తూ అలరిస్తోంది.

 ఇలా వేదికపై తన నటనతో అందరినీ నవ్వించే ఫైమా నిజ జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కష్టాల గురించి వెల్లడించారు.

తన ఇంట్లో ఎంతో పేదరికం ఉండేదని తనకు కేవలం ఒక పది రూపాయలు కావాలన్న తన తల్లిని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని ఈ సందర్భంగా పైమా వెల్లడించారు.తన తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించిందని, వాటిని అమ్మి కుటుంబాన్ని ముందుకు నెట్టుకొస్తుంది అంటూ తన కన్నీటి కష్టాలను తెలిపారు.

ఇకపోతే ఒకప్పుడు మా ఇంటి అడ్రస్ అడిగినా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్పే వాళ్ళు కూడా కాదు.అయితే జబర్దస్త్ కార్యక్రమం నాకు ఎంతో మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా ఫైమా వెల్లడించారు.

Advertisement
Jabardasth Faima Comments On Her Life Struggles Details, Jabardast Faima, Tolly

ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయాయని నా పేరు చెబితే చాలామంది మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అంటూ మా ఇంటి అడ్రస్ చెబుతున్నారని ఈమె తెలిపారు.ఇక నా ఫేస్ పెద్దగా సెల్ఫీలు దిగే మొహం కాదు.

Jabardasth Faima Comments On Her Life Struggles Details, Jabardast Faima, Tolly

అయినా చాలామంది నాతో సెల్ఫీలు దిగడానికి ఇష్టపడుతున్నారని,ఇదంతా తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉందని ఈ సంతోషానికి కారణం కేవలం జబర్దస్త్ కార్యక్రమం మాత్రమేనని ఫైమా వెల్లడించారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన బుల్లెట్ భాస్కర్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు దగ్గరుండి ఎలా నటించాలి అనే విషయాల గురించి బాగా ట్రైనింగ్ ఇచ్చారు.ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉండటం చూసి నా తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తన తల్లికి ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక బలంగా ఉందని తన తల్లి కోరిక తీర్చడమే తన కోరిక అంటూ ఈ సందర్భంగా పైమా తన కన్నీటి కష్టాలను తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు