యాక్టింగ్ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసిన జబర్దస్త్ కమెడియన్..?

నటనా జీవితంలో ఇష్టమైన యాక్టింగ్ కోసం బంగారం లాంటి ఉద్యోగాలను వదిలేసుకున్న నటులు ఎంతోమంది ఉన్నారు.

సినీ పరిశ్రమలో చాలా మంది నటులు తమ నటన మీద ఆసక్తి కోసం మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి నటన రంగంలోకి అడుగు పెడుతారు.

ఇదిలా ఉంటే మరో బుల్లితెర నటుడు కూడా ఏకంగా తన నటన కోసం గవర్నమెంట్ జాబునే వదిలేశాడు.ఇంతకు అతను ఎవరంటే.

బుల్లితెర లో ప్రసారమయ్యే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు.జబర్దస్త్ కు ముందు పటాస్ షో లో కామెడీ చేస్తుండే వాళ్లు.

అంతేకాదు పటాస్ కంటే ముందు జీ తెలుగులో కూడా ఓ కామెడీ షో లో నటించాడు.ప్రస్తుతం జబర్దస్త్ జీవన్ టీంలో నటిస్తున్నాడు.

Advertisement

తన పంచ్ లతో బాగా ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను.విజయవాడ పవర్ ప్లాంట్ లో ఉద్యోగం చేసేవాడినని తెలిపాడు.ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్ మీద ఆసక్తితో అవకాశాల కోసం తెగ ట్రై చేసేవాడట.

ఇక అలాంటి సమయంలో ఆయనకు జీ తెలుగులో ప్రసారమౌతున్న కామెడీ షో లో అవకాశం వచ్చిందట.ఇక తన గవర్నమెంటు జాబ్ చేస్తూ యాక్టింగ్ లో కూడా బిజీ గా అయ్యాడు.

ఇక ఉద్యోగం చేయడం వల్ల కామెడీ షో లో నటించడం ఇబ్బంది గా మారిందట.దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకిష్టమైన యాక్టింగ్ రంగంలో మరింత ఆసక్తి చూపాడట‌.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

ఇలా ఎంతో మంది నటులు తమకిష్టమైన రంగం పట్ల ఎటువంటి ఉద్యోగం అయినా వదిలేసుకుంటారు.ఇదిలా ఉంటే నూకరాజు తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కమెడియన్ గా మారడంతో అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement