ఆ ఇద్దరు పూరి కి నో చెప్పారు

లోఫర్ తో మనముందు కొత్త వరుణ్ తేజ్ ని ప్రవేశపెట్టిన పూరి జగన్నాథ్, ఇప్పుడు కన్నడ చిత్రసీమకి కొత్త హీరోని పరిచయం చేసే పనిలో పడ్డారు.

రోగ్ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో ఇషాన్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి.

ఇషాన్ ఎవరో కాదు , శ్రీకాంత్ మహాత్మ చిత్రాన్ని తెలుగులో నిర్మించిన సి.ఆర్ మనోహర్ కొడుకు.ఈ మధ్యే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనది.

ఇందులో ఇషాన్ కి జోడిగా మొదట తమన్నాని సంప్రదించారు.డేట్స్ అడ్జెస్ట్ అవలేదో, కొత్త హీరోతో నటించే ఆసక్తి లేదో, తమన్నా కష్టం అని సమాధానమిచ్చింది.

ఆ తరువాత శృతి హాసన్ ని అడిగితే, బాలివుడ్, తెలుగు, తమిళ్ లో అగ్ర హీరోల సరసన నటించే శృతి కన్నడ లాంటి చిన్న ఇండస్ట్రీలో, అది కుడా కొత్త హీరోతో చేసేందుకు ఒప్పుకోలేదు.రెండు చోట్లా మొండిచేయి ఎదురవడంతో ముంబై భామ పూజ జవేరి ని పట్టుకొచ్చాడు పూరి.

Advertisement

ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, అందులో పూజ ఒకరు, మరో కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫిక్స్ అవలేదు.ఇక ఈ చిత్రం తరువాత తెలుగులో పూరి చేయబోయే తదుపరి సినిమా ఏమిటో ఇంతవరకు ఖరారు కాలేదు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు