వ‌ర్షాకాలంలో ఆవు పాల‌ల్లో వీటిని క‌లిపి తీసుకుంటే ఆరోగ్యం మీవెంటే!

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.ఈ సీజన్ లో వివిధ రకాల వ్యాధులు చుట్టు ముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.

వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖ‌చ్చితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.అలాగే డైట్ లో పోషక ఆహారాన్ని చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఆవు పాలల్లో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి తీసుకుంటే వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆవు పాలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ చియా సీడ్స్‌, ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఆవు పాలను పోసుకోవాలి.

Advertisement
It Is Very Good For Health If They Are Taken In Cow Milk During Monsoon! Cow Mil

పాలు కాస్త హిట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు స్పూన్ యాలకుల పొడి, పావు స్పూన్ అల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

It Is Very Good For Health If They Are Taken In Cow Milk During Monsoon Cow Mil

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి పాలను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ పాలల్లో నానబెట్టుకున్న చియా సీడ్స్ మరియు వ‌న్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసి తాగేయ‌డ‌మే.రోజుకు ఒకసారి ఈ విధంగా ఆవు పాలను తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.బరువు తగ్గుతారు.

గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

Advertisement

మరియు ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం పరార్ అవుతాయి.

తాజా వార్తలు