అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం... ధర వింటే కళ్లు తేలేస్తారు!

ప్రపంచంలో వివిధ రకాల జీవులు కనిపిస్తాయి.వీటిలో చాలా అరుదైనవి కూడా ఉంటాయి.

కుక్క, పిల్లి, గుర్రం మొదలైన జంతువులను చాలా మంది ఇష్టపడతారు.కొంతమంది పక్షులను పెంచడానికి ఇష్టపడతారు.

చాలామంది వాటిని కొనడానికి మరియు పెంచడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.కానీ ఇప్పుడు మనం ఒక విచిత్రిమైన కీటకం గురించి తెలుసుకుందాం.

అది సాధారణ కీటకం కాదు, ఇలాంటి కీటకాన్ని చాలామంది లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి కొంటున్నారు.అవును ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం గురించి తెలుసుకోబోతున్నాం.

Advertisement
It Is The Most Expensive Insect In The World The Price Will Make Your Eyes Open

అటువంటి అరుదైన పురుగు భూమిపై ఉన్న కీటకాలలోనే మనకు కనిపిస్తుంది.దీని కోసం ప్రజలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.

ఈ అరుదైన కీటకం ధర చాలా ఎక్కువ.దీని కోసం వెచ్చించే మొత్తంతో మీరు ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయవచ్చు.

ఇంతటి ఖరీదు చేసే కీటకాన్ని స్టాగ్ బీటిల్ అంటారు.ఈ అరుదైన పురుగు రెండు మూడు అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది.

చాలా మంది కీటకాలను అసహ్యించుకుంటారు.అయితే ఈ కీటకాన్ని కొనడానికి లెక్కలేనంతమంది పోటీ పడుతుంటారు.

స్కిన్ టోన్ రోజురోజుకు తగ్గిపోతుందా.. వర్రీ వద్దు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి!

ఇంత ఎక్కువ ధరకు ఈ కీటకాన్ని కొనుగోలు చేయాలనుకోవడంలో గొప్పదనం ఏముందనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది.దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

It Is The Most Expensive Insect In The World The Price Will Make Your Eyes Open
Advertisement

రాత్రికి రాత్రే లక్షాధికారిని చేయవచ్చు.ఒక కీటకాన్ని కొనడానికి ఎవరూ కూడా 100 రూపాయలు కూడా ఖర్చు చేయరు.అయితే ఈ పురుగును కొనుగోలు చేసేందుకు కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా చాలామంది వెనుకాడరు.అయితే దీని విచిత్రమైన ఆకృతిని చూసి ఎవరూ ఇష్టపడరు.

కానీ దీని ప్రత్యేకత గురించి తెలిసిన వెంటనే వారు దాని కోసం 50 లక్షల నుండి కోటి వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.ఇది లూకానిడే జాతికి చెందిన పురుగు.

ఇది చాలా అరుదైని కావడం వలన ఇది చాలా ఖరీదైనదిగా మారింది.ఈ కీటకంతో అనేక రకాల ఖరీదైన మందులను కూడా తయారు చేస్తారు.

శీతాకాలంలో మరణిస్తుంది ఈ కీటకానికున్న నల్లటి తల నుండి రెండు కొమ్ములు ఉద్భవించాయి.దీని సగటు పరిమాణం 2 నుండి 4.8 అంగుళాల మధ్య ఉంటుంది.కొన్నేళ్ల క్రితం జపాన్‌కు చెందిన ఓ పెంపకందారుడు ఈ పురుగును సుమారు రూ.65 లక్షలకు విక్రయించాడు.దీనిని కోటి రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు.

ఇది వేడి ప్రదేశాలలో నివసిస్తుంది.శీతాకాలం వచ్చినప్పుడు స్టాగ్ బీటిల్స్ కూడా చనిపోతాయి.

ఎరువులు, చెత్త కుప్పల కింద ఈ కీటకం నివసిస్తుంది.

తాజా వార్తలు