ఎంపీ అభ్యర్ధులను నిర్ణయించేది  రేవంతే ! రేసులో ఉంది వీరే 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది .వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో, పార్లమెంట్ ఎన్నికల్లోను ఆ ప్రభావం కనిపిస్తుందని,  కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారనే అంచనాలు ఉండడంతో,  కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా బరిలోకి దిగేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ జాబితాలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు.

ఇక పూర్తిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతుందని,  వారు సూచించిన వారికే ఎంపీ అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందని అంత భావిస్తుండగా , ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy )కే బాధ్యతలు అప్పగించిందట .అభ్యర్థుల ఎంపిక తంతు మొత్తం రేవంత్ నే ఖరారు చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించారట.

It Is Revanth Reddy Decides The Mp Candidates They Are In The Race , Telangana

వచ్చే  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే విధంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని సూచించినట్లు సమాచారం.ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తే ప్రజల్లోకి వారు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని ఒక అంచనాకు వచ్చారు .ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై రేవంత్ దృష్టి సారించారు.రేవంత్ సూచించిన అభ్యర్థుల జాబితానే ఏఐసిసి అధికారికంగా ప్రకటించబోతుందట.

Advertisement
It Is Revanth Reddy Decides The MP Candidates! They Are In The Race , Telangana

  12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పై ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.ఏక అభిప్రాయంతో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించబోతున్నారట.

నల్గొండ స్థానం నుంచి సీనియర్ నేత జానారెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కనుంది.  ఇక మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇక కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి పేరు ఇదే నియోజకవర్గంలో నుంచి వినిపిస్తోంది.ఖమ్మం సీటును పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉందట.

అలా కానుపక్షంలో రేణుక చౌదరి( Renuka chowdhury ) లేదా పొట్ల నాగేశ్వరావు పేర్లు  పరిశీలనకు వస్తున్నాయి .

It Is Revanth Reddy Decides The Mp Candidates They Are In The Race , Telangana
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు వంశీ పేరు వినిపిస్తోంది.మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లేదా విజయభాయిలలో ఒకరికి అవకాశం దక్కనుంది.వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య లేదా మంత్రి పదవి ఇవ్వకపోతే అద్దంకి దయాకర్, లేదా దొమ్మాట సాంబయ్య పేర్లు వినిపిస్తున్నాయి .భువనగిరి నుంచి కోమటిరెడ్డి లక్ష్మి( Komatireddy Lakshmi ) లేదా శ్యామల కిరణ్ రెడ్డిలలో ఒకరిని ఎంపి చేయనున్నారు మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి లేదా సీతా దయాకర్ రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉన్నట్లు సమాచారం .ఇక మెదక్ నుంచి విజయశాంతిని పోటీకి దింపనున్నారట.హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Advertisement

సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లేదా నవీన్ యాదవ్ పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారట.నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా జీవన్ రెడ్డిని పోటికి దింపనున్నారు.

  నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేరు , చేవెళ్ల నుంచి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి లేదా కొత్తగా పార్టీలో చేరేందుకు ఆసక్తితో ఉన్న ఓ బీజేపీ కీలక నేతకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ,  రోహిత్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్ పేరు పరిశీలనలో ఉంది.

తాజా వార్తలు