అనుకోకుండా జరిగింది.. గోవాలో దీపిక పిల్లి సందడి

ఈమధ్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అవుతున్నారు.తమ సొంత టాలెంట్ లతో డాన్సులను చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

గతంలో ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ యాప్ గురించి అందరికీ తెలిసిందే.ఆ యాప్ వేదికగా ఎందరో వినియోగదారులు స్టార్స్ గా ఎదిగారు.

అంతే కాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చుకుంటున్నారు.ఇక యాప్ బ్యాన్ చేసిన తర్వాత కూడా వారి టాలెంట్ ను మాత్రం ఆపలేదు సోషల్ మీడియా స్టార్ లు.యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా తమ టాలెంట్ ను మళ్లీ మొదలు పెట్టారు.అలా ఓ సోషల్ మీడియా స్టార్ ఏకంగా బుల్లితెరపై యాంకర్ గా అవకాశం అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఇంతకు ఆమె ఎవరో కాదు టిక్ టాక్ లో తన అందంతో, పొట్టి పొట్టి డ్రెస్సులతో, పిచ్చెక్కించే డాన్సులతో ఆకట్టుకున్న టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లి.ఆమె తన డాన్స్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

Advertisement

ఇక ప్రతిరోజూ ఏదో ఒక వీడియో తో బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు వస్తూ ఉంటాయి.

ఈమె ఎప్పటికప్పుడు కొత్తగా విడుదలైన పాటలకు స్టెప్పులు వేస్తూ వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.అలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ గా మారడం వల్ల తనకు టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి.మొదట్లో మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీ లో ప్రసారమైన ఢి డాన్స్ షో లో యాంకర్ రష్మీ తో తను కూడా టీం లీడర్ గా పనిచేసింది.

ఇక అందులో తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది.పైగా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది దీపిక పిల్లి.ఇక ఈ షో తర్వాత ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకాలో ఏకంగా యాంకర్ గా అవకాశం అందుకుంది.

ఇందులో శేఖర్ మాస్టర్ తో కలిసి తను చేసే డాన్స్ స్టెప్పులు చూస్తే మాత్రం ఫిదా కావాల్సిందే.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

సోషల్ మీడియా లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన స్టెప్పులతో బాగా సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటోంది.తెగ ఫోటో షూట్ లను చేయించుకుంటూ వాటిని వెంటనే షేర్ చేస్తుంది.

Advertisement

అప్పుడప్పుడు ట్రిప్స్ ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో తాను గోవా ట్రిప్ కు వెళ్ళినట్లు కనిపించగా ఈ ట్రిప్ అనుకోకుండా జరిగింది అన్నట్లు తెలిపి తెగ సందడి చేస్తుంది.ఇక ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

మొత్తానికి బుల్లితెరపై సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది దీపిక.

" autoplay>

తాజా వార్తలు