న్యూజిలాండ్ లో దాడికి శ్రీలంకలో ప్రతీకారం! ఐఎస్ఐఎస్ ఉగ్రదాడి వెనుక అసలు వాస్తవం

ఈస్టర్ రోజుల క్రిస్టియన్స్ పూర్తిగా ప్రార్ధనలలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కొలంబో మొత్తం బాంబులతో దద్దరిల్లింది.

చర్చిలు, హోటల్స్ ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులు చేయగా, మరికొన్ని చోట్ల బాంబులు పెట్టి బ్లాస్ట్ లు చేసారు.

ఓ విధంగా ఒకే రోజు సీరియల్స్ బ్లాస్ట్స్ ల వెనుక శ్రీలంక ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.నిఘా వర్ఘాలు హెచ్చరికలు చేసిన కూడా, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ బాంబు దాడులకి ప్రధాన కారణం ఈ వరుస బాంబు పేలుళ్లలో 310 మంది మృతిచెందగా.

వీరిలో ఎనిమిది మంది భారతీయులు కూడా ఉన్నారు.అయితే, ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్టు విస్పష్టమైన ఆధారాలు లభించాయి.

తాజాగా, ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను ఐసిస్ సానుభూతి టెలిగ్రామ్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.ఐసిస్ జెండా పట్టుకున్న ఈ ముగ్గురు ఆత్మాహుతి సభ్యులను అబుల్ బర్రా, అబ్దుల్ ముఖ్తార్, అబు ఉబైదా‌గా గుర్తించారు.

Advertisement

న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముజాహిర్ ఇటీవల ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు.ఈ నేపధ్యంలోనే ఐఎస్ఐఎస్ అక్కడ ప్రతీకారం కోసం శ్రీలంకని ఎంచుకున్నారని తెలుస్తుంది.

వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!
Advertisement