వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీలో తమ ఉనికి ఉండాలని బలంగా నిర్ణయించుకున్న జనసేన( JanaSena ) అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది.
అందుకోసం తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, తమ సామాజిక వర్గం కీలకంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించే పనిలో పడింది.
గత ఎన్నికల్లో తమ అధినేత రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడం అన్నది ఆ పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది.ఇది విపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారిపోయింది.ఈ పాయింట్ను పదేపదే ఎత్తుతూ జనసేన స్థాయిని తగ్గించే విధంగా ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో ఎటు పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందే అన్న పట్టుదలతో జనసేనాని ఉన్నారని అందుకే తన అన్నను గెలిపించిన తిరుపతి నియోజకవర్గం(T irupati ) నుంచి ఈ ఈసారి ఆయన పోటీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
సొంత నియోజక వర్గం హ్యాండ్ ఇచ్చినా కూడా చిరంజీవి( Chiranjeevi )ని ఆదుకున్న ఈ నియోజకవర్గం ఈసారి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి కూడా విజయాన్ని కట్టబెడుతుందని జనసైనికులు అంచనా వేస్తున్నారు.కాపులు బలిజలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తిరుపతి ఒకటి.గత ఎన్నికలలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన భుమన కరుణాకర్ రెడ్డి అంత బలంగా వీసిన జగన్ వేవ్ లో కూడా కేవలం 700 వోట్ల తో బయట పడ్డారు.
ఇక్కడ జనసేన అభ్యర్థి భారీ స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారు.తెలుగుదేశం పార్టీ కూడా కాపు అభ్యర్థిని నిలబెట్టడంతో ఓట్లు చీలిపోయి భూమన గెలిచారు .అందుకే ఈ స్థానాన్ని పోటీ చేస్తే గెలుపు తధ్యమని లెక్కలు వేసుకున్న జనసేన అధినాయకత్వం ఈసారి ఇక్కడి నుంచే పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు.
ఏది ఏమైనా జనసేన బలం పెరిగిందని అంచనాల నడుమ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నజనసేన వచ్చే ఎన్నికలలో కీలకంగా మారబోతుందని తెలుస్తుంది.అభిమానుల ఆదరణతో పాటు ఈసారి సామాజిక వర్గం మద్దతు కూడా జనసేనకు బలంగానే ఉంది ఆ దిశగా ఇప్పటికే కాపు సామాజిక వర్గ పెద్దలు ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.ఇక సాధారణ ప్రజలను న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం నిజాయితీగా చేస్తే ఈసారి కచ్చితంగా జనసేన అసెంబ్లీలో తన గలాన్ని వినిపించగలుగుతుందని.
ప్రభుత్వంలో కీలకంగా మారబోతుందని అంచనాలు వస్తున్నాయి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy