అమెజాన్ అడవిలో సంచరిస్తున్న ఓ అరుదైన తెగ ఇదే?

ఈ భూ ప్రపంచంలో నాగరికతకు చాలా దూరంగా, సామాన్యుడి కంటికి కనిపించనంత సీక్రెట్ గా నివసిస్తున్న తెగలు ఎన్నో ఉన్నాయి.

అమెజాన్ అడవుల్లోAmazon Rainforest ) కూడా చాలా రకాల తెగ ప్రజలు ఉన్నారని అంటారు.

వీరిని చూస్తేనే భయం కలుగుతుంది.తాజాగా ఈ అడవిలో సంచరించే ఒక తెగ ప్రజల వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

వీరు సాధారణంగా కెమెరాలకు దొరకరు.ఒక సంస్థ ఈ అరుదైన తెగ ప్రజలను కెమెరాలో తెలివిగా క్యాప్చర్ చేయగలిగింది.

పెరువియన్ అమెజాన్‌( Peruvian Amazon )లో వీళ్లు నివసిస్తుంటారు.ఈ తెగను మాష్కో పైరో అని పిలుస్తారు.సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే ఇండిజినస్ రైట్స్ అడ్వకసీ గ్రూప్ ఈ తెగ ప్రజల గురించిన వివరాలను, వీడియోలను విడుదల చేసింది.

Advertisement

ఆ గ్రూప్ ప్రకారం ఈ తెగ ప్రజలకు, బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం ఉండదు.వీళ్లు ఓన్లీ అడవుల్లోనే నివసిస్తారు.పెరు దేశానికి సమీపంలో ఉన్న లాస్ పీడ్రాస్ రివర్ దగ్గర వీళ్లు బతుకుతున్నారు.

ఈ తెగ ప్రజలు ఇక్కడే ఉన్నారా లేదా అనే అనుమానం అధికారుల్లో మొన్నటిదాకా తొలగిపోలేదు.అయితే వీళ్ళు వీడియోకి చిక్కాక ఆ డౌట్ క్లియర్ అయింది.ఇప్పుడు వారు అక్కడే ఉంటున్నట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి.

ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శలు వస్తున్నాయి.ఆ ప్రాంతాన్ని వేరే వ్యక్తులకు అమ్మినట్లు కూడా విమర్శలు వచ్చాయి.

ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ తెగ కెమెరాల కంటికి చిక్కినట్లుగా అధికారులు తెలిపారు.ఇదే ప్రాంతానికి సమీపంలో మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో వంటి గ్రామాలు ఉన్నాయి.

చైనాలో వ్లాగ్ చేస్తూ అతి చేసిన భారతీయ యువతి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..?
వైరల్ వీడియో : లాకప్‌లో ఉన్న స్నేహితుడితో రీల్స్..

ఈ గ్రామాల ప్రజలు ఆ తెగ ప్రజలకు మధ్య కొట్లాటలు జరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఒక ప్రాంతాన్ని వారు ఆక్రమించేస్తారు అందులోకి ఇతరులు వస్తే ఆహార వనరుల కొరత ఏర్పడుతుందని భయపడతారు.

Advertisement

తాజా వార్తలు