మార్పు తప్పదంటున్న బీజేపీ.. మరి ప్లానేంటి ?

ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ( BJP ) గట్టిగానే దెబ్బతీశాయనే చెప్పాలి.

అంతకు ముందు తమకు తిరుగెలేదన్నట్లు వ్యవహరించిన కమలనాథులు ప్రస్తుతం ఆత్మస్థైర్యం కోల్పోయి డీలాపడ్డారు.

ఇక ఈ ఏడాది చివర్లో మరో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా కొట్టిన ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా పడే అవకాశం ఉంది.

ఫలితంగా కేంద్రంలో అధికారం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.ఇదే ఇప్పుడు బీజేపీ నేతలను కలవర పెడుతున్న అంశం.

Is There A Change In Bjp , Bjp, Narendra Modi, Amith Shah , Congress , Karnatak

ఇక ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మద్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్ ఘాట్, మిజోరాం వంటి రాష్ట్రాలలో బీజేపీ ఏమంత ప్రభావవంతంగా లేదు.ఒక్క మద్యప్రదేశ్ లో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ, మిగిలిన రాష్ట్రాలలో ఇంకా ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంది.ఈ రాష్ట్రాల ఎన్నికలకు 5 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో పక్కా వ్యూహరచనతో ముందుకు సాగాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Is There A Change In BJP? , Bjp, Narendra Modi, Amith Shah , Congress , Karnatak

కర్నాటక ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అధిగమించి.కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా అధికారంలోకి రావలనే ప్లాన్ లో కాషాయ పార్టీఉన్నట్లు తెలుస్తోంది.అందుకే పార్టీని బలోపేతం చేయాలంటే అధ్యక్ష మార్పులు తప్పవనే ఆలోచన చేస్తోందట బీజేపీ అధిష్టానం.

Is There A Change In Bjp , Bjp, Narendra Modi, Amith Shah , Congress , Karnatak

ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా అధ్యక్ష మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.ప్రస్తుతం రాజస్తాన్ ( Rajasthan )బీజేపీ అధ్యక్షుడిగా చంద్ర ప్రకాష్ జోషి, మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విశ్వదత్ శర్మా కొనసాగుతున్నారు.ఈ ఇద్దరినీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అగ్రేస్సివ్ గా ఉండే నేతలకు అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉందట కాషాయ అధిష్టానం.

ఇక తెలంగాణలో కూడా అధ్యక్ష మార్పుపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నప్పటికి, హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే బండి సంజయ్( Bandi sanjay ) ని తప్పిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ఉందని అందుకే తెలంగాణ విషయంలో అధ్యక్ష మార్పు ఆలోచనను పక్కన పెట్టేసింది.కానీ మిగిలిన రాష్ట్రాలలో మాత్రం అధ్యక్ష మార్పు తథ్యం అనే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తోందట.

మరి ఐదు రాష్ట్రాలలో గెలుపుకోసం బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు