వీర్రాజు కు ఆ పదవి.. ? విష్ణుకూ ఛాన్స్ ? 

ఏపీలో సొంతంగా బలం పెంచుకునే విషయంపై బీజేపీ ( BJP ) దృష్టి సారించింది.ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని బిజెపి చూస్తున్నా.

అందుకు సరైన అవకాశం మాత్రం దక్కడం లేదు.  ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏపీలో అధికారంలో ఉంది.

దీంతో ఏపీలో బిజెపి గ్రాఫ్ కూడా పెరుగుతుందనే అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి.ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వమే ఏపీలో అధికారంలో ఉండడంతో,  మిగతా టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలను నొప్పించకుండా క్రమంగా బలం పెంచుకునే విషయంపై బిజెపి దృష్టి పెట్టింది.

దీనిలో భాగంగానే పార్టీని నమ్ముకుని మొదటి నుంచి ఉన్నవారికి పదవుల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది.ప్రస్తుతం శాసనమండలిలో ఏ ఒక్క సీటు ఖాళీ అయినా , అది కూటమి పార్టీలకే దక్కుతుంది.

Advertisement

  స్థానిక సంస్థలు , పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను పక్కన పెడితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూటమీ అభ్యర్థులే వాటిని సొంతం చేసుకుంటారు.

ఏపీ లో ఏ ఎమ్మెల్సీ స్థానం  ఖాళీ అయినా అవి కూడా కూటమి ఖాతాలోనే పడుతాయి.  దీంతో భవిష్యత్తులో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలను కూటమి పార్టీలైన టిడిపి,  జనసేన,  బిజెపిలే పంచుకోవాల్సి ఉంటుంది.ఎమ్మెల్సీ స్థానాలపై టిడిపి, జనసేన , బిజెపి భారీ ఆశలతోనే ఉన్నాయి.

మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి.అయితే బిజెపి మాత్రం మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని,  ఈ మేరకు టిడిపి, జనసేన లను ఒప్పించాలని నిర్ణయించుకుంది.

ముఖ్యంగా బిజెపి సీనియర్ నేత మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( BJP president Somu Veerraju ) కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బిజెపి హైకమాండ్ భావిస్తోందట .మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి టిక్కెట్ ను వీర్రాజు ఆశించారు.అయితే పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని బిజెపి హై కమాండ్ ఆలోచన చేస్తోందట.వీర్రాజు తో పాటు,  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ( Vishnuvardhan Reddy )పేరు కూడా పరిశీలిస్తున్నారట.

Advertisement

మొన్నటి ఎన్నికల్లో  హిందూపురం పార్లమెంట్ స్థానం లేదా కదిరి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.  కానీ పొత్తులో భాగంగా అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు ఆయనకూ ఎమ్మెల్సీ ఇవ్వాలని భావిస్తున్నారట.మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని నమ్ముకున్న నేతలకు పదవులు ఇవ్వడం ద్వారా పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే సంకేతాలు కేడర్ కు వెళ్తాయని బీజేపీ పెద్దల ఆలోచన గా తెలుస్తోంది.

తాజా వార్తలు