సుకుమార్ మరోసారి సీక్వెల్ సినిమా చేయనున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ( Ram Charan )లాంటి నటుడు వరుస సినిమాలు చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా( game changer movie ) చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద తన పంజా దెబ్బ ను రుచి చూపించాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఇక అలాగే ఆర్ సి సెవెంటీన్ గా మరోసారి సుకుమార్( Sukumar ) తో జతకట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు.

Is Sukumar Going To Make A Sequel Again , Ram Charan, Game Changer Movie, Sukuma

ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో రంగస్థలం సినిమా వచ్చింది.ఇక ఇప్పుడు రంగస్థలం కి సీక్వెల్ గా మరొక సినిమా చేయాలనే ప్లాన్ లో వీళ్లిద్దరూ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు శిక్వెల్స్ సినిమాల పరంపర కొనసాగుతున్న సమయంలో ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది.

Advertisement
Is Sukumar Going To Make A Sequel Again , Ram Charan, Game Changer Movie, Sukuma

ఇప్పటికే సుకుమార్ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సీక్వెల్ ని తీస్తున్నప్పటికీ మరోసారి రంగస్థలం సీక్వెల్ని తీయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే సుకుమార్ వరుసగా సీక్వెల్స్ పైన దృష్టి పెట్టడం పట్ల అతని అభిమానులు గాని తెలుగు సినిమా ప్రేక్షకులు గాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే రంగస్థలం సినిమా మాత్రం మంచి హై ఫీల్ ఇచ్చింది.

Is Sukumar Going To Make A Sequel Again , Ram Charan, Game Changer Movie, Sukuma

కాబట్టి ఆ సినిమాలో చిట్టి బాబు పాత్ర కూడా బాగా హైలైట్ అయింది.ఇక ఆ పాత్రని మరోసారి చూడబోతున్నందుకు రామ్ చరణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి రామ్ చరణ్ ఈ సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటాడా లేదా అనేది.

ఒకవేళ ఈ మూడు సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటే ఆయన కూడా పాన్ ఇండియా లో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు