Sri Reddy Chiranjeevi : విషపురుగు గాడు అంటూ చిరంజీవి పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి?

తెలుగు సినీ ప్రేక్షకులకు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఏదోక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి.

ఇక మెగా ఫ్యామిలీ పై తరచూ ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటుంది.ఇటీవల నాగబాబు పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాను చదువుకున్న నరసాపురం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరవ్వడం కోసమే నరసాపురంలో జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఖైరతాబాద్ లో నిర్వహించారు.

ఇక ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన పాత అనుభవాల గురించి అలాగే రాజకీయాల గురించి పలు ఆసక్తి గల వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలి అంటే రాటు తేలి ఉండాలని అనడానికైనా అనిపించుకోవడానికి అయినా సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే నేను రాజకీయాలలో అంతగా రాణించలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి రెండింటికి సిద్ధంగా ఉన్నాడని మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు పవన్ మంచి స్థానంలో నిలబడతాడు అని తెలిపారు చిరంజీవి.ఇదే విషయంపై శ్రీ రెడ్డి మండిపడుతూ చిరంజీవి పై ఒక రేంజ్ లో విరుచుకు పడింది.

ఈ క్రమంలోనే ఫేస్బుక్లో ఒక పోస్టును కూడా చేసింది.ఈ పక్కనున్నాడు దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు.

ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు ఈ వెధవ.పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట.

ఇంకొకసారి ఈ విషపురుగు గాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని నేను చెప్పే అంత సీన్ నాకు లేదు కానీ ఆర్డర్ నే అంటూ రాసుకు వచ్చింది.అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఈ విధంగా స్పందిస్తూ మెగాస్టార్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు