ఛానెల్ ఏర్పాటులో సాయిరెడ్డి బీజీ.. టార్గెట్ వారేనా ?

వైసిపి రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )వైసిపి అధినేత జగన్ ( jagan )కు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఒకరు.

ఇటీవల ఆయన అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.

ముఖ్యంగా దేవదాయ శాఖలో పనిచేసే ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.వ్యక్తిగతంగా , రాజకీయంగా విజయ సాయి రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Is Sai Reddy Bg The Target In Setting Up The Channel, Vijay Sai Reddy, Ysrcp, Y

  అయితే వైసీపీలోని( YCP ) కీలక నేతలే తనను టార్గెట్ చేసి, తనను అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విజయ్ సాయి రెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాను కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లుగా విజయ సాయి రెడ్డి ప్రకటించారు.దానికి తగ్గట్లుగానే ఛానల్ ఏర్పాటుకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు ఓ ఛానల్ కు చెందిన వ్యక్తితో విజయసాయిరెడ్డి చర్చలు జరిపారని , భారీ ప్యాకేజీ తో ఆయనకు చానల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు విజయ సాయి రెడ్డి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

Is Sai Reddy Bg The Target In Setting Up The Channel, Vijay Sai Reddy, Ysrcp, Y
Advertisement
Is Sai Reddy BG The Target In Setting Up The Channel, Vijay Sai Reddy, Ysrcp, Y

ఈ దసరా నాటికి కొత్త ఛానల్ ను ప్రారంభించేందుకు విజయ సాయి రెడ్డి సిద్ధమవుతున్నారు.గతంలోనే ఛానల్ ఏర్పాటుకు విజయసాయి రెడ్డి ప్రయత్నించినా,  జగన్ వద్దని చెప్పడంతో ఆగిపోయానని,  కానీ ఇప్పుడు ఛానల్ ఏర్పాటు చేసి తీరుతానంటూ విజయసాయిరెడ్డి ప్రకటించారు.తనకు ఓ మహిళతో సంబంధం ఉందంటూ ఇటీవల పెద్ద ఎత్తున టిడిపి విమర్శలు చేయడంతో పాటు,  తనను టార్గెట్ చేసుకున్నా.

  జగన్ సొంత చానల్ లో తనకు మద్దతుగా కథనాలు ప్రచారం కాకపోవడం , కావాలని తనను వైసీపీలోని ఉన్నత స్థాయి వ్యక్తులే టార్గెట్ చేసుకోవడం తదితర కారణాలతోనే దసరా నాటికి ప్రారంభించేందుకు విజయ సాయి రెడ్డి సిద్ధమవుతున్నారు.ఈ ఛానల్ ఏర్పాటు విషయంలో ఎవరు ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గకూడదనే ఆలోచనతో ఆయన ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు