'పుష్ప 2'లో లేడీ పవర్ స్టార్.. ఆ వార్తలపై అమ్మడు క్లారిటీ!

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి.తన అందం, అభినయంతో మొదటి సినిమా తోనే అందరిని ఫిదా చేసి.

న్యాచురల్ బ్యూటీ అనే గుర్తింపుతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న భామ సాయి పల్లవి ( Sai Pallavi ).ఇప్పుడు సాయి పల్లవి అంటే పేరు కాదు.బ్రాండ్ అనే స్థాయికి ఈమె చేరుకుంది.

సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.కానీ చేసింది కొన్నే అయినా క్రేజ్ మాత్రం భారీగానే వచ్చింది.

ఈ అమ్మడు సినిమాలో ఉంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తేలిపోవాల్సిందే.అయితే సాయి పల్లవి తన కెరీర్ డల్ అవుతుంది అని ఏ అవకాశాన్ని బడితే ఆ అవకాశాన్ని ఒప్పుకోకుండా సినిమా లోని పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడంవంటివి చేయడం వల్ల తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది.

Advertisement

సాయి పల్లవి ఇటీవలే నటించిన సినిమాల్లో గార్గి ఒకటి.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈమె నుండి ఏ సినిమా అప్డేట్ అయితే రాలేదు అనే చెప్పాలి.కానీ గత కొంత కాలంగా ఈమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

లేడీ పవర్ స్టార్ అని పిలిపించు కుంటున్న సాయి పల్లవి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాలో భాగం కాబోతుంది అని టాక్ వినిపిస్తూనే ఉంది.

మరి ఈ వార్తలపై ఈ అమ్మడు తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది.పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి కూడా ఉంది వచ్చే వార్తలపై ఈమె మాట్లాడుతూ.నేను ఈ సినిమాలో నటించడం లేదు.

కానీ ఈ సినిమాలో నేను కూడా ఉన్నానని వచ్చిన వార్తలకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.అని అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈమె చెప్పడంతో ఈమె ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఈ పాన్ ఇండియన్ సినిమాలో ఈమె కూడా ఉంది అనుకుని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.కానీ ఇప్పుడు ఈమె క్లారిటీ ఇవ్వడంతో నిరాశ చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు