రష్మిక కూడా అలాంటి సమస్యతో బాధపడుతోందా... అసలు విషయం చెప్పిన నటి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటీసిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత గత కొంతకాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే సమంత ఇలాంటి వ్యాధితో బాధపడుతుందని తెలియగానే చాలామంది హీరోయిన్లు తాము ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే నటి మమతా మోహన్ దాస్, పూనమ్ కౌర్, కల్పిక గణేషన్ వంటి తదితరులు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే తాజాగా నటి రష్మిక మందన్న సైతం ఇలాంటి చర్మవ్యాధులతో బాధపడుతున్నారని అర్థమవుతుంది అయితే ఈమె చేసినటువంటి పోస్ట్ ఇలాంటి అనుమానాలకు కారణమవుతున్నాయి.సాధారణంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు తన డైరీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా మరోసారి ఈమె తన దినచర్యకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

ఇందులో భాగంగా.డియర్‌ డైరీ.ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది.

లేవగానే కార్డియో వర్క్‌ అవుట్‌ చేశా.ఆ తర్వాత ఆహారం తీసుకున్నా.

రేపటి షెడ్యూల్ కోసం లగేజ్ సర్దుకున్నా అయితే ఎప్పటిలాగే నా చూట్టు వాతావారణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండ డ్రామాలు చేశాయి.ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్‌ అవుట్‌ చేశా.

ఆ తర్వాత డిన్నర్‌ చేశా.ఇక డెర్మట్‌.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

(డెర్మటాలజీ) అపాయింట్మెంట్ తీసుకున్న అలాగే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అది క్యాన్సిల్ అయింది.

Advertisement

మీటింగ్ క్యాన్సిల్ కావడంతో తిరిగి ఇంటికి వచ్చేసా.గుడ్ నైట్ బాగా పడుకో అంటూ లవ్ సింబల్ షేర్ చేశారు.ఇలా ఈమె తన డైరీలో భాగంగా డెర్మేట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటూ రాసుకు వచ్చారు.

దీంతో రష్మిక ఎందుకు డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈమె ఏదైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా అందుకే డాక్టర్ ను కలవడం కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారా అంటూ పలువురు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.మరి ఈమె ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తెలియాలి అంటే రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.