ఇప్పుడు చెప్పండి.. మళ్లీ రానా నాయుడు వస్తాడా?

వెంకటేష్, రానా ప్రధాన పాత్ర లో నటించిన రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

గత సంవత్సర కాలంగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయినా వెంటనే పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూసేసారు.

అయితే ఈ సిరీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అల్లరించలేక పోయింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి పూర్తి దూరంగా ఈ సిరీస్ ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వెంకటేష్(venkatesh) వంటి ఫ్యామిలీ హీరో తో ఇలాంటి సిరీస్ తీయడాన్ని ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు.రానా గతంలో ఇలాంటి సన్నివేశాలు, సినిమాల్లో నటించక పోయినా కూడా పెద్దగా ప్రభావం తెలియడం లేదు.

కానీ వెంకటేష్ మాత్రం ఇలాంటి సిరీస్ లో సన్నివేశాలు నటించకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.రానా నాయుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో తప్పకుండా సీజన్ 2 ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

మేకర్స్ కూడా రానా నాయుడు సీజన్ 2 వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సిరీస్ కి వస్తున్న స్పందన నేపథ్యంలో రెండవ భాగం వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రానా మరియు వెంకటేష్ ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ రెండవ భాగాన్ని తీసేందుకు ఆసక్తిగా ఉన్నారా లేదా అనేది చెప్పాలంటూ కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు.కనుక ఇప్పట్లో రానా నాయుడు యొక్క సీక్వెల్‌ వచ్చే అవకాశం లేదు.కనుక విషయం గురించి ప్రస్తుతానికి చర్చ అక్కర్లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రానా (Rana)నుండి మరిన్ని వెబ్‌ సిరీస్ లు వచ్చినా పర్వాలేదు కానీ వెంకటేస్ మాత్రం కచ్చితంగా వెబ్‌ సిరీస్ లకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు