రామ్ చరణ్ డెసిషన్ మార్చుకుంటాడా..!

శుక్రవారం రిలీజ్ అవుతున్న ఆచార్య సినిమాకు తను చేయాల్సిందంతా చేస్తున్నాడు చరణ్.ఆర్.

ఆర్.ఆర్ ఫీవర్ ఇంకా తగ్గకముందే ఆచార్యగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ లో మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.తెలుగులో మళ్లీ రావా సినిమా చేసి హిట్ అందుకున్న గౌతం తిన్ననూరి నానితో జెర్సీ తీసి సూపర్ హిట్ కొట్టాడు.

Advertisement

అదే సినిమాను హిందీలో రీమేక్ చేశాడు.షాహిద్ కపూర్ నటించిన హిందీ రీమేక్ రివ్యూస్ బాగానే వచ్చినా టాక్ మాత్రం తేడా కొట్టేసింది.

వసూళ్లు కూడా పెద్దగా లేవని తెలుస్తుంది.ఈ లెక్కన హిందీ జెర్సీ దాదాపు ఫ్లాప్ అయినట్టే అంటున్నారు.

టైం లో చరణ్ గౌతం తిన్ననూరితో సినిమా చేస్తాడా లేక తన నిర్ణయం మార్చుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.చరణ్ తో చేసే సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అని టాక్.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement